Breaking News: భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టు రద్దు.. కారణం ఏంటంటే..

INDvsENG: భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు చివరి నిమిషంలో రద్దయ్యింది. ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2021, 01:52 PM IST
  • టీమిండియా శిబిరంలో కరోనా కలకలం
  • భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ రద్దు
  • ఆంగీకరించిన ఇరు బోర్డులు
Breaking News: భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టు రద్దు.. కారణం ఏంటంటే..

India vs England 5th Test set to be Cancelled: భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దు అయ్యింది. ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ”జట్టు శిబిరంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో టీమిండియా ప్లేయర్స్ ఆటపై విముఖత చూపిస్తున్నారు. వారిని నిర్ణయాన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని” ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ వెల్లడించారు. ఒకవేళ మ్యాచ్ ఆలస్యమైతే.. ఐపీఎల్(IPL) షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. 

గురువారం జరిపిన కరోనా టెస్టుల్లో టీమిండియా ఆటగాళ్లకు నెగిటివ్ వచ్చినప్పటికీ.. కొంతమంది ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా ప్లేయర్స్ బీసీసీఐ లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారట. దీనితో అటు బీసీసీఐ(BCCI).. ఇటు ఈసీబీ.. టెస్ట్ మ్యాచ్‌పై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక తాజాగా టీమిండియా ప్లేయర్స్‌కు మరోసారి కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్నాయట. ఇదిలా ఉంటే ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri)తో పాటు ఫిజియో, ఇతర సహాయక సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారందరూ క్వారంటైన్‌లో ఉన్నారు.

Also Read:T20 world cup 2021: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం! అసలేం జరిగిందంటే..

బయోబబుల్(Bio Bubble) దాటి పుస్తక ఆవిష్కరణకు వెళ్లడంపై కూడా ఈసీబీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయంపై తాము విచారణ ప్రారంభించామని బీసీసీఐ తెలిపింది. ఈ మొత్తం ఘటన ఇరు బోర్డుల మధ్య విభేదాలకు దారి తీసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News