Rishabh Pant - Bat: అచ్చు చిన్న పిల్లల మాదిరే.. బ్యాట్‌కి క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్!!

బంతిని బలంగా కొట్టే క్రమంలో రిషబ్ పంత్ చేతి నుంచి బ్యాట్‌ జారి అల్లంత దూరాన పడింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 04:24 PM IST
  • రిషబ్ పంత్‌ చేతి నుంచి జారిన బ్యాట్‌
  • ఫీల్డర్‌ లేకపోయాడు కాబట్టి సరిపోయింది
  • బ్యాట్‌కి క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్
Rishabh Pant - Bat: అచ్చు చిన్న పిల్లల మాదిరే.. బ్యాట్‌కి క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్!!

 Rishabh Pant kissing His Bat like Child: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఇటీవల ఓ యాడ్‌ చేశాడు. బ్యాట్‌ (Bat) పట్టు గురించి మనోడికి పంచ్ వేసేలా అందులో ఓ డైలాగ్‌ ఉంటుంది. అది చాలా ఫేమస్ అయింది కూడా. బంతిని బలంగా కొట్టే క్రమంలో పంత్ చేతి నుంచి బ్యాట్‌ జారి అసంత దూరాన పడుతుంది యాడ్‌లో. అప్పుడు రీల్ కోసం చేసిన పంత్.. తాజాగా రియల్‌గానే చేశాడు. పంత్‌ చేతి నుంచి బ్యాట్‌ జారిన ఘటన భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీసులో చోటుచేసుకుంది. ఇప్పుడు ఆ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే... 

కేప్ టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది. ఆటలో మూడో రోజైన గురువారం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడింది. కీలక సమయంలో టెయిలెండర్లతో కలసి రిషబ్ పంత్‌ టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. చెత్త బంతి దొరికితే చాలు బౌండరీకి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో డుఆనే ఒలివర్‌ వేసిన బంతిని ఆఫ్‌ సైడ్‌ బౌండరీకి తరలించాడు. అయితే బ్యాట్‌ పంత్ చేతి నుంచి జారి లెగ్‌ సైడ్‌ 30 అడుగుల సర్కిల్‌ దగ్గర పడింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో నవ్వులు పూశాయి. పంత్ కూడా ఓ చిరునవ్వు నవ్వాడు.

Also Read: Novak Djokovic - Visa: ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి జకోవిచ్‌ ఔట్.. మూడేళ్ల పాటు నిషేధం! గ్రాండ్‌స్లామ్‌ ఆశ ఆవిరయ్యే!

తన చేతి నుంచి జారిన బ్యాట్‌ దగ్గరికి వెళ్లిన రిషబ్ పంత్‌.. ఓ నవ్వు నవ్వేసి పట్టుకున్నాడు. బ్యాట్ తీసుకున్న పంత్.. చిన్న పిల్లల మాదిరే దానికి క్షమాపణలు (Pant Apologised) చెప్పాడు. చిన్నపుడు మనం పెన్ను లేదా పెన్సిల్ నేలపై పడితే.. దాన్ని ఎలాగైతే కళ్లకు అద్దుకుని ముద్దాడుతామో.. పంత్ కూడా తన బ్యాటుకు 3-4 సార్లు ముద్దులు పెట్టాడు. ఇందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఫాన్స్ అందరూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'పంత్ తన బ్యాట్‌ని గౌరవించే విధానం చాలా బాగుంది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అచ్చు చిన్న పిల్లల మాదిరే.. బ్యాట్‌కి క్షమాపణలు చెప్పాడు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 

మరోవైపు వీడియోకు సామాజిక మాధ్యమాల్లో వెరైటీ కామెంట్లు వస్తున్నాయి. 'రిషబ్ పంత్‌ బ్యాటు పడిన చోట ఫీల్డర్‌ లేకపోయాడు కాబట్టి సరిపోయింది.. ఉంటే ఏమయ్యేదో' అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఇంకొందరేమో 'బ్యాటు అంత దూరం వెళ్లింది కదా.. అదనపు పరుగులు ఏమైనా ఇస్తారా?' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 'రిషబ్ పంత్‌ బ్యాటింగ్‌ మారినా.. స్టైల్ మాత్రం మారలే' అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ సెంచరీ కొట్టాడు. 139 బంతుల్లో 6 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకొని నాటౌట్‌గా నిలిచాడు.

Also Read: IED Recovered in Delhi: ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం... ఉగ్ర కుట్ర భగ్నం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News