Mohammad Shami: 200 వికెట్ అనంతరం.. షమీ ఎమోషనల్ సెలబ్రేషన్స్! ఎవరి కోసమో తెలుసా? (వీడియో)

టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా మహమ్మద్‌ షమీ రికార్డు నెలకొల్పాడు.  అయితే బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్‌ షమీ తన సెలబ్రేషన్స్ ఎవరి కోసమో చెప్పాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 02:42 PM IST
  • మహమ్మద్‌ షమీ అరుదైన రికార్డు
  • మహమ్మద్‌ షమీ 200 వికెట్
  • మహమ్మద్‌ షమీ ఎమోషనల్ సెలబ్రేషన్స్
Mohammad Shami: 200 వికెట్ అనంతరం.. షమీ ఎమోషనల్ సెలబ్రేషన్స్! ఎవరి కోసమో తెలుసా? (వీడియో)

Mohammed Shami Emotional Celebrations For his Father after 200th Test Wicket: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్‌ షమీ (Mohammed Shami) అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. దాంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు (200th Test Wicket) తీసిన మూడో భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. షమీ కంటే ముందు మాజీ పేసర్లు కపిల్ దేవ్‌ (Kapil Dev), జవగళ్‌ శ్రీనాథ్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కపిల్ దేవ్ 50 టెస్టుల్లో 200 వికెట్లు పడగొట్టగా.. శ్రీనాథ్‌ 54 టెస్టుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. అయితే 200 వికెట్లు తీయగానే షమీ తన రెండు చేతులను పైకి ఎత్తి చిరునవ్వుతో ఎవరికో సందేశం పంపారు. 

మూడో రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్‌ షమీ తన సెలబ్రేషన్స్ ఎవరి కోసమో చెప్పాడు. '200 వికెట్ల మార్కును చేరుకున్న తర్వాత చేసుకున్న సంబరాలు మా నాన్న గారి కోసమే. నాన్న 2017లో మరణించారు. ఈ విజయం క్రెడిట్ మొత్తం నాన్నకే చెందుతుంది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ప్రధాన కారణం మా నాన్న. 200 వికెట్ తీయగానే నాన్న గుర్తుకు వచ్చారు. ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను' అని BCCI.TVలో షమీ తెలిపారు. 

Also Read: Jasprit Bumra - Sanjana Ganeshan: జస్ప్రీత్ బుమ్రాతో వెకేషన్.. సంజన గణేశన్‌ హాట్‌నెస్‌కు ఫాన్స్ ఫిదా!!

'మాది ఉత్తర ప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామం. కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. దీంతో మా నాన్న రోజు నన్ను 30 కిలోమీటర్లు సైకిల్‌పై అకాడమీకి తీసుకెళ్లేవారు. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నాపై నమ్మకంతో ప్రోత్సహించారు. నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. టెస్టు క్రికెట్ అంటే రాకెట్ సైన్స్‌ కాదు. టెస్టుల్లో.. పిచ్‌ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ బంతులేయాలనే విషయంపై అవగాహన ఉండాలి. అందుకు వీలైనంత ఎక్కువగా శ్రమించాలి' అని మహమ్మద్‌ షమీ చెప్పారు. 

'కష్టపడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఐదు వికెట్లు (5 Wicket Halu) పడగొట్టగానే చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని (200th Test Wickets) కూడా చేరుకున్నాను. ఇది చాలా సంతోషకరమైన మరియు గర్వించదగిన అనుభూతి. టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రోజు.. నేను ఏదో సాధించగలనని అనుకున్నాను. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. జట్టు కోసం నా ప్రదర్శనను కొనసాగించాలని ఆశిస్తున్నాను. క్రికెట్‌ను ఎంతగా ఆస్వాదిస్తే అంత మంచి ప్రదర్శనలు వస్తూనే ఉంటాయి' అని టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్‌ షమీ (Mohammed Shami) చెప్పుకొచ్చారు. 

Also Read: Flipkart Year End Sale: రూ.19,999 ధర గల Realme 8s 5g స్మార్ట్ ఫోన్ కేవలం రూ.549కే..త్వరపడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News