IND Vs SA, 1st Test Day 1: బ్యాటర్లు రాణించటంతో..దక్షిణాఫ్రికాతో (South Africa) జరుగుతున్న మెుదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ (IND Vs SA) లో ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (122*), రహానె (40*) ఉన్నారు. అంతకు ముందు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60) అర్ధశతకం సాధించాడు. కోహ్లీ (35) ఫర్వాలేదనిపించినా.. ఛెతేశ్వర్ పుజారా (0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
రాహుల్ సెంచరీతో భారత్ (India) ఆధిక్యంలో నిలిచింది. బాక్సింగ్ డే రోజున(డిసెంబర్ 26) సెంచరీ మార్క్ అందుకున్న కేఎల్ రాహుల్‌కు టెస్టుల్లో ఇది ఏడో శతకం. విదేశీ గడ్డపై ఐదో సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ (KL Rahul) టెస్టు ఓపెనర్‌గా పలు రికార్డుల బద్దలుకొట్టాడు. టీమిండియా టెస్టు ఓపెనర్‌గా విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్ (( 34 ఇన్నింగ్స్‌లో 5 సెంచరీలు)కు రెండోస్థానం దక్కింది. మెుదటి స్థానంలో సునీల్ గావస్కర్(81 ఇన్నింగ్స్‌లో 12 సెంచరీలు) ఉన్నారు.
Also Read: Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్.. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?!!
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డపై పర్యాటక జట్టు ఓపెనర్‌గా సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా కేఎల్ రాహుల్ (KL Rahul) నిలిచాడు. ఇంతకముందు సయీద్ అన్వర్(పాకిస్తాన్), క్రిస్ గేల్(వెస్టిండీస్) మాత్రమే ఈ ఘనత సాధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook