IND vs SA 3వ టీ20: సౌతాఫ్రికా విజయ లక్ష్యం 173 !

సౌతాఫ్రికాలోని కేప్ టౌన్‌ న్యూలాండ్స్ స్టేడియం వేదికగా మరో చారిత్రాత్మకమైన పోరు

Last Updated : Feb 25, 2018, 01:24 AM IST
IND vs SA 3వ టీ20: సౌతాఫ్రికా విజయ లక్ష్యం 173 !

సౌతాఫ్రికాలోని కేప్ టౌన్‌లో న్యూలాండ్స్ స్టేడియం వేదికగా నేడు సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన 3వ టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేయగలిగింది . ఎన్నో ఆశలతో సౌతాఫ్రికా గడ్డపై కాలు పెట్టిన టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత భారీ ఆధిక్యంతో వన్డే సిరీస్‌లో విజయం సాధించింది. 

అంతిమంగా శనివారం జరుగుతున్న ఈ చివరి 3వ టీ20 మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాపై విజయం సాధించి రెండు టైటిల్స్‌తో ఇండియాలో సగర్వంగా అడుగుపెట్టాలని చూస్తోంది. మరి టీమిండియా ఆశలకు సఫారీ సేన గండి కొడుతుందా లేక సఫారీ సేనను కట్టడి చేసి టీమిండియానే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ని కూడా సొంతం చేసుకుంటుందా తెలియాలంటే సఫారీల బ్యాటింగ్ ముగిసే వరకు వేచిచూడాల్సిందే.

Trending News