IND vs SA: రెండో వన్డేలో రాణించిన హెండ్రిక్స్‌, మార్‌క్రమ్.. భారత్‌ లక్ష్యం ఎంతంటే?

South Africa set 279 target to India in 2nd ODI. టీండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 278 రన్స్ చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 9, 2022, 06:13 PM IST
  • రెండో వన్డేలో రాణించిన హెండ్రిక్స్‌
  • మూడో వికెట్‌కు 129 పరుగులు
  • భారత్‌ లక్ష్యం ఎంతంటే?
IND vs SA: రెండో వన్డేలో రాణించిన హెండ్రిక్స్‌, మార్‌క్రమ్.. భారత్‌ లక్ష్యం ఎంతంటే?

South Africa set 279 target to India in 2nd ODI: రాంచి వేదికగా టీండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 278 రన్స్ చేసి.. భారత్ ముందు 279 పరుగుల లక్ష్యంను ఉంచింది. ప్రొటీస్ బ్యాటర్లు ఐడెన్ మార్‌క్రమ్‌ (79; 89 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్), రీజా హెండ్రిక్స్‌ (74; 76 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్‌, షహబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకొంది. దక్షిణాఫ్రికా ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (5)ను మొహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. జననేమన్ మలన్ (25) త్వరగానే ఔట్ అయ్యాడు. దాంతో రీజా హెండ్రిక్స్‌, ఐడెన్ మార్‌క్రమ్‌ ఆచితూచి ఆడారు. భారత బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. అయితే ఈ ఇద్దరు క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నారు. దాంతో పదిహేను ఓవర్లకు దక్షిణాఫ్రికా 59/2 స్కోరుతో నిలిచింది.

క్రీజ్‌లో కుదురుకున్నాక రీజా హెండ్రిక్స్‌, ఐడెన్ మార్‌క్రమ్‌ ధాటిగా ఆడారు. ఏ క్రమంలోనే ఇద్దరు హాఫ్ సెంచరీలు బాదారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 129 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. హేన్రిచ్ క్లాసెన్‌ (30) కూడా ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికా దూకుడు పెంచే సమయంలో భారత బౌలర్లు పుంజుకొని పరుగులను అడ్డుకున్నారు. దాంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయలేకపోయింది. ఇన్నింగ్స్ చివర్లో డేవిడ్‌ మిల్లర్ (35 నాటౌట్) ధాటిగా ఆడేందుకు యత్నించాడు.

Also Read: King Kobra Venom: కింగ్ కోబ్రా కోరల్లోంచి విషం తీసిన వ్యక్తి.. బాబోయ్ ఇంత ఉంటుందా!

Also Read: కొండచిలువ కాటేసినా అస్సలు బెదరలేదు.. నీ ధైర్యానికి ఓ పెద్ద సలాం బాసూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News