IND Vs PAK Latest Updates: భారత్ Vs పాక్‌ పోరుకు రంగం సిద్ధం.. తుది జట్టు ప్రకటన

Pakistan Announce Playing 11 Vs India: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న పోరు రేపు జరగనుంది. భారత్, పాక్ జట్లు ఆసియా కప్‌లో శుక్రవారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందే పాక్ జట్టు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 1, 2023, 10:53 PM IST
IND Vs PAK Latest Updates: భారత్ Vs పాక్‌ పోరుకు రంగం సిద్ధం.. తుది జట్టు ప్రకటన

Pakistan Announce Playing 11 Vs India: టీమిండియాతో పోరుకు పాకిస్థాన్ జట్టు రంగం సిద్ధం చేసుకుంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ పోరుకు ఒక రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించింది. శుక్రవారం క్యాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు కూడా పాక్ జట్టు ప్లేయింగ్‌ 11ను ప్రకటించింది. భారత్‌తో పోరుకు ముందు కూడా అలానే చేసింది. ఫఖర్ జమాన్ స్థానంపై ఊహాగానాలు ఉండగా.. తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇమామ్-ఉల్-హక్ ఇమామ్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. 

కెప్టెన్ బాబర్ అజామ్ 3వ స్థానంలో రానున్నాడు. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 4వ స్థానంలో ఆడనున్నాడు. ఆఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్ ఆ తరువాత స్థానాల్లో రానున్నారు. ఆల్ రౌండర్లుగా షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ తుది జట్టులో ఉన్నారు. పాకిస్థాన్‌కు గుడ్‌న్యూస్ ఏంటంటే.. స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. భారత్‌పై పాకిస్థాన్ అదే జట్టుతో బరిలోకి దిగనుంది.

ఇక ఈ మ్యాచ్‌కు వరణుడు ముప్పు పొంచి ఉండడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి కేవలం 5 వేల మంది అభిమానులు మాత్రమే క్యాండీకి చేరుకున్నారు. వాతావరణ సూచన 90 శాతానికి పైగా వర్షం పడే అవకాశం ఉన్నందున అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదు. మ్యాచ్ జరిగే సమయంలో రోజంతా మేఘావృతమై అడపాదడపా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ పూర్తిగా రద్దయితే.. భారత్, పాక్ జట్లు చెరో పాయింట్‌ను పంచుకుంటాయి. సూపర్‌ ఫోర్‌లోకి పాక్ జట్టు అడుగుపెడుతుంది. నేపాల్‌తో మ్యాచ్‌ టీమిండియాకు కీలకంగా మారుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్‌ ఫోర్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. 

పాకిస్థాన్ తుది జట్టు: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, ఆఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రౌఫ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.

Also Read: Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!  

Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News