Ravichandran Ashwin: ఇంగ్లండ్ పై 'వికెట్ల' సెంచరీ చేసిన అశ్విన్.. ఫస్ట్ ఇండియన్ గా రికార్డు..

Ind vs Eng 04th Test: ఇంగ్లండ్ పై అశ్విన్ వికెట్ల సెంచరీ చేశాడు. ఈఘనత సాధించిన తొలి భారత్ బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు మరికొన్ని ఘనతలను కూడా అశ్విన్ అందుకున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 04:58 PM IST
Ravichandran Ashwin: ఇంగ్లండ్ పై 'వికెట్ల' సెంచరీ చేసిన అశ్విన్.. ఫస్ట్ ఇండియన్ గా రికార్డు..

Ravichandran Ashwin Achieve Rare feat: టీమిండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్(Ravichandran Ashwin) మ‌రో ఘ‌న‌త సాధించాడు. రీసెంట్ గా 500 వికెట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ ఆఫ్ స్పిన్న‌ర్.. తాజాగా ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో బెయిర్ స్టో వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ జట్టుపై 23 టెస్టుల్లో 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. అంతేకాదు రెండు జట్ల మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా అతడే. మెుదటి స్థానంలో అండర్సన్ (139 వికెట్లు) ఉన్నాడు. 

ఈ రికార్డు ఒకటే కాదు మరో ఘనతను కూడా సాధించాడు అశ్విన్. వెయ్యి పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. క్రికెట్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన ఏడోవాడు అశ్విన్, ఇంగ్లండ్ పై మాత్రం మూడోవాడు. రాంచీ టెస్టులో మరో రెండు వికెట్లు తీస్తే స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తాడు ఆశ్విన్. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 350 వికెట్లతో (63 మ్యాచ్‌ల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ టెస్టు ద్వారా మరో రికార్డును కూడా అశ్విన్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీస్తే.. కుంబ్లే 35 సార్లు ఐదు వికెట్లు రికార్డును సమం చేస్తాడు 

Also Read: CSK IPL Schedule 2024: ధోని, కోహ్లీ మధ్యే తొలి మ్యాచ్.. చెన్నై షెడ్యూల్ ఇదే..!

మరోవైపు నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. భారత్ బౌలర్ల దెబ్బకు లంచలోపే ఐదు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సీనియర్ ఆటగాడు రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. అతడికి బెన్ ఫోక్స్ చక్కటి సహకారం అందించారు. ప్రస్తుతం ఆ జట్టు 90 ఓవరల్లో ఏడు వికెట్లు నష్టానికి 302 పరుగులు చేసింది. రూట్ 106 పరుగులతోనూ, రాబిన్సన్ 31 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Also Read: IPL 2024 schedule: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ ఢీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News