Ind vs Aus 2nd T20 Match: ఆస్ట్రేలియాతో నాగపూర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ని సమం చేసింది. మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి కసి తీర్చుకుని మూడో మ్యాచ్ నాటికి సిరీస్‌పై ఆశలు పెంచాలని భావించిన టీమిండియా.. అనుకున్నట్టుగానే పకడ్బందీగా ఆడి ఆసిస్ ఆటగాళ్లపై విజయం సొంతం చేసుకుంది. దీంతో ఇక ఇప్పుడంతా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇండియా vs ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ కావడంతో ఉప్పల్‌లో సెప్టెంబర్ 25న ఆదివారం నాడు జరగనున్న చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది.
ఆ ఇద్దరే హైయెస్ట్ స్కోరర్స్..
నాగపూర్ మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యమవడంతో 20 ఓవర్ల మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆసిస్ ఆటగాళ్లలో మాథ్యూ వేడ్ అత్యధికంగా 43 పరుగులు (20 బంతుల్లో) రాబట్టగా ఆ తర్వాత ఆరోన్ ఫించ్ 31 పరుగులు (15 బంతుల్లో) చేశాడు. 91 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో 46 పరుగులు (20 బంతుల్లో) చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
రోహిత్ శర్మ ఒంటరి పోరాటం..
ఆరంభంలోనే కేఎల్ రాహుల్, ఆ తర్వాత కాసేపటికే సూర్య కుమార్ యాదవ్ డకౌట్, టీమిండియా స్కోర్ అర్థ సెంచరీ వద్ద ఉండగానే విరాట్ కోహ్లీ 11 పరుగులకే (6 బంతుల్లో) ఔట్ అయినప్పటికీ, హార్థిక్ పాండ్య 9 పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. రోహిత్ శర్మ మాత్రం నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచి విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. చివర్లో వచ్చిన దినేశ్ కార్తిక్.. స్టైల్‌గా సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. చివరి ఓవర్లో మరో 5 బంతులకు 3 పరుగులు చేయాల్సి ఉందనగా.. దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టి టీమిండియాకు విజయం అందించాడు. ఆసిస్ బౌలర్లలో ఆడం జంపా 3 కీలకమైన వికెట్లు తీసి చెలరేగిపోగా... ప్యాట్ కమిన్స్ మరో వికెట్ పడగొట్టాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకోగా.. జస్ప్రిత్ బుమ్రా 1 వికెట్ తీసుకున్నాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌తో కీలకమైన ఆసిస్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : HMRL for Ind vs Aus Match: సెప్టెంబర్ 25న ప్రత్యేక రైళ్లు.. హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్
Also Read : IND vs AUS 3rd T20I: ఉప్పల్ మ్యాచ్‌పై నీలినీడలు.. మరో చోటుకు షిఫ్ట్ చేసే ఆలోచనలో బీసీసీఐ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి