ICC introduces Massive In-Match Penalty for slow over rate in T20I Cricket: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఎప్పటికపుడు కొత్త నిబంధలు, నియమాలను తీసుకొస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్ (T20I Cricket)లో శుక్రవారం (జనవరి 7) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ల (Slow Over Rate)కు పెనాల్టీని ప్రకటించింది. అలాగే మ్యాచ్ సమయంలో డ్రింక్స్ విరామం తీసుకోవాలని నిబంధన విధించింది. ఈ నిబంధనలు జనవరి 16న వెస్టిండీస్-ఐర్లాండ్ జట్ల మధ్య జరగబోయే మొదటి టీ20తో అమల్లోకి వస్తాయి. ఈ కొత్త నిబంధనలతో టీ20 ఫార్మాట్ మరింత ఆసక్తిగా మారనుంది.
టీ20 క్రికెట్లో స్లో ఓవర్ రేట్ బౌలింగ్ చేస్తే.. ఫీల్డింగ్ చేసే జట్టుకు మ్యాచ్ జరుగుతుండగానే (Match Penalty) భారీ శిక్ష పడనుంది. ఫీల్డింగ్ చేసే జట్టు ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొదటి బంతిని నిర్ధేశిత సమయానికి వేయాలి. లేదంటే ఎన్ని ఓవర్లు లేదా బంతులు మిగిలినా.. 30 యార్డ్ సర్కిల్ వెలుపల ఉన్న ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుంది. అంటే 30 యార్డ్ సర్కిల్ (30 Yard Circle) వెలుపల నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. సాధారణంగా అయితే పవర్ ప్లే తర్వాత ఐదుగురు ఫీల్డర్లకు అనుమతి ఉంటుందన్న సంగతి తెలిసిందే.
Also Read: IND vs SA: మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ పేసర్ ఔట్!!
స్లో ఓవర్ రేట్ బౌలింగ్ చేస్తే.. ఫీల్డింగ్ చేసే జట్టుకు పెద్ద మైనస్‌గా మారుతుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడడానికి వీలు ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. ఫీల్డింగ్ చేసే జట్టు నిర్ణీత సమయం లోపల తమ ఓవర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో స్లో ఓవర్ రేట్ వేస్తే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించేవారు. అయితే మ్యాచ్ ఫీజులు, వార్నింగ్‌లతో జట్ల తీరులో మార్పు రాకపోవడంతో ఐసీసీ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది.
జనవరి 16న వెస్టిండీస్-ఐర్లాండ్ (WI vs IRE) మధ్య జరగబోయే తొలి టీ20తో ఈ నిబంధన (స్లో ఓవర్ రేట్) అమల్లోకి వస్తుంది. అలాగే వెస్టిండీస్-దక్షిణాఫ్రికా (WIW vs SAW) మహిళా జట్ల మధ్య జనవరి 18 నుంచి జరగబోయే టీ20 సిరీస్ నుంచి మహిళల టీ20ల్లోనూ ఈ నిబంధనను అమలు చేయనున్నారు. మరోవైపు మ్యాచ్ టైంలో ఇరు జట్లు ఒకసారి డ్రింక్స్ బ్రేక్ (Drinks Break) తీసుకోవచ్చు. అయితే ఇది సిరీస్ ప్రారంభానికి ముందు ఆయా జట్ల ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది.
Also Read: Covid third wave E-Commerce sales: థర్డ్ వేవ్ తరుముకొస్తోంది.. అందుకే అక్కడ సేల్స్ పెరిగాయ్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి