వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మన్రో ప్రపంచ రికార్డును సాధించాడు. 53 బంతుల్లో 10 సిక్స్‌లు, 4 ఫోర్లతో 104 పరుగులు చేసిన మన్రో తన టీ20 కెరీర్ లో చేసిన మూడవ సెంచరీ ఇది. అలాగే టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్ కూడా ఇతనే. మన్రో తర్వాతి స్థానాల్లో రెండు సెంచరీలతో మెకల్లమ్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ ఉండడం గమనార్హం.
పైగా ఇదే మ్యాచ్‌లో న్యూజిలాండ్ తమ టీమ్ తరఫున టీ20 కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది (5 వికెట్లకు 243 పరుగులు). న్యూజిలాండ్ బ్యాటింగ్ తర్వాత లక్ష్య సాధనలో భాగంగా హిట్టింగ్ మొదలుపెట్టిన వెస్టిండీస్.. 16.3 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.