ముంబై: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఓ మెరుపు మెరిసిన గ్లెన్ మెక్ గ్రాత్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. తన కెరీర్లో అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన మెక్‌గ్రాత్‌కు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చాలా సార్లు దీటుగా సమాధానం చెప్పాడు. అయితే సచిన్ కంటే వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు 'చార్ సౌ వాలా' బ్రియాన్ లారాకు బౌలింగ్ చేసేందుకే తాను ఇబ్బంది పడ్డానని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు.
సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా ఇద్దరూ అద్భుతమైన బ్యాట్స్మెన్లే.. అయినప్పటికీ, సచిన్‌తో పోల్చితే లారా మరింత స్వేచ్ఛగా, నిర్భయంగా బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు. అందుకే లారాకు బౌలింగ్ చేయడం కష్టమని అన్నాడు. లారా ఎప్పుడూ తన శైలిని మార్చుకోలేదన్నాడు. తనతో పాటు షేన్ వార్న్ ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియాలో లారా అత్యధిక పరుగులు చేశాడని చెప్పాడు. తాను లారాను 15 సార్లు ఔట్ చేసి ఉంటానని గుర్తు చేసుకున్నాడు. కానీ, ఆసీస్‌పై అతను ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడని, అదే లారా బాటింగ్ శైలి అని కితాబిచ్చాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..