ఆ 'ఔట్' ఎందుకు వివాదాస్పదమైంది..?

అబ్‌స్ట్రక్టింగ్‌ అవుట్‌ .. బ్యాట్స్‌మన్‌ ఒకవేళ కావాలని బంతికి అడ్డుతగిలి అవుట్ అయితే దానిని ఎంపైర్లు "అబ్‌స్ట్రక్టింగ్‌ అవుట్‌"గా పరిగణిస్తారు.

Last Updated : Jan 11, 2018, 05:50 PM IST
ఆ 'ఔట్' ఎందుకు వివాదాస్పదమైంది..?

అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్ .. బ్యాట్స్‌మన్‌ ఒకవేళ కావాలని బంతికి అడ్డుతగిలి ఔట్ అయితే దానిని ఎంపైర్లు "అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌"గా పరిగణిస్తారు. ఎప్పుడో గానీ క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురు కాదు. కానీ ఇటీవలే బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో బ్రిస్బేన్‌ హీట్‌ తరపున ఆడుతున్న అలెక్స్‌ రాస్‌ అనే ఆటగాడు ఈ విధంగా ఔట్ అవ్వడం కాస్త వివాదాస్పదమైంది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. బుధవారం బ్రిస్బేన్‌ హీట్‌-హోబార్ట్‌ హరికేన్స్‌ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. అందులో తొలి బ్యాటింగ్‌ చేసిన హరికేన్స్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున సెకండ్ డౌన్‌గా దిగిన అలెక్స్ రాస్ అనే ఆటగాడు.. అనుకోకుండా ప్రత్యర్థి బౌలర్ వేసిన బంతికి వికెట్ల మధ్య పరుగెత్తాల్సి వచ్చింది.

అదే సమయంలో ఫీల్డర్ విసిరిన బంతి అతన్ని తాకుతూ వికెట్ల మీదకు వెళ్లి వాటిని గిరాటేసింది. కానీ.. అప్పటికే బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చేయడంతో దానిని ఔట్‌గా పరిగణించాలో లేదో అంపైర్లకు అంతుబట్టలేదు.

కానీ థర్డ్ అంపైర్ దానిని "అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌"గా పరిగణించడంతో అందరూ అవాక్కయ్యారు. కానీ బంతికి ఆపడానికి బ్యాట్స్‌మన్ కావాలని ప్రయత్నించలేదని.. దీనిని "అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌"గా పరిగణించలేమని.. థర్డ్ అంపైర్ నిర్ణయం తప్పని కొందరు చెప్పడంతో ఆ ఔట్ వివాదాస్పదమైంది

Trending News