BBL 2021-22: బిగ్​బాష్ ​లీగ్​లో కరోనా కలకలం..గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కొవిడ్ పాజిటివ్..మరో 12 మందికి కూడా..!

Big Bash League: బిగ్​బాష్ ​లీగ్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 02:09 PM IST
BBL 2021-22: బిగ్​బాష్ ​లీగ్​లో కరోనా కలకలం..గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కొవిడ్ పాజిటివ్..మరో 12 మందికి కూడా..!

BBL 2021-22: బిగ్​బాష్ ​లీగ్​లో (Big Bash League) కరోనా కలకలం రేపుతోంది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ను (Melbourne Stars) కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టులోని 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ టీమ్ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు (Glenn Maxwell) కోవిడ్‌ సోకింది. యాంటీజెన్‌ టెస్టు చేయగా... అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. 

అంతకుముందు మెల్‌బోర్న్‌  స్టార్స్‌ ((Melbourne Stars) జట్టు ఆటగాళ్లు ఆడం జంపా, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, మార్కస్‌ స్టొయినిస్‌ సహా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ఐసోలేషన్‌ పూర్తి కావడం, కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో వీరు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. శుక్రవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో పాల్గొననున్నారు.

Also Read: Sana Ganguly Covid 19: సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్.. సనా గంగూలీకి పాజిటివ్! ఆందోళనలో దాదా ఫ్యామిలీ!

కరోనా కేసులు (Corona cases in BBL) పెరుగుతున్న నేపథ్యంలో.. బ్రిస్బేన్ హీట్ (Brisbane Heat) , సిడ్నీ సిక్సర్‌ల (Sydney Sixers) మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్ (match postponed) ను వాయిదా వేశారు. ఈ మేరకు బీబీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొంది. మరోవైపు టీమిండియా క్రికెట్‌ను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. ఇటీవల గంగూలీ (Ganguly) కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా గంగూలీ కుమార్తె సనాకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News