Novak Djokovic Visa Cancelled: టెన్నిస్ స్టార్ కు ఆస్ట్రేలియా షాక్.. జకోవిచ్‌ వీసా రద్దు!

Novak Djokovic: టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అతడిని 8 గంటలు ఎయిర్‌పోర్టులోనే నిలిపేశారు అధికారులు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 08:50 AM IST
  • జకోవిచ్‌కు చేదు అనుభవం
  • 8 గంటలు ఎయిర్‌పోర్టులోనే నిలిపేసిన అధికారులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన సెర్బియా ప్రభుత్వం
Novak Djokovic Visa Cancelled: టెన్నిస్ స్టార్ కు ఆస్ట్రేలియా షాక్.. జకోవిచ్‌ వీసా రద్దు!

Novak Djokovic Visa Cancelled: టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌కు (Novak Djokovic) ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. కరోనా వ్యాక్సిన్ (Covid-19 Vaccine) తీసుకోని కారణంగా అతడి వీసాను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు ఈ సెర్బీయా ఆటగాడు బుధవారం మెల్‌బోర్న్‌కు చేరుకున్నాడు. అయితే, కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన తగిన ఆధారాలు సమర్పించని కారణంగా జకోవిచ్‌ను నిలిపిపేసినట్లు ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ (Australian Border Force) అధికారులు తెలిపారు. దీంతో 8 గంటల పాటు జకోవిచ్ మెల్‌బోర్న్ ఎయిర్ పోర్టులో ఉండిపోవాల్సి వచ్చింది. 

ఈ ఘటనపై సెర్బియా ప్రభుత్వం మండిపడింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడితో ఇలాగేనా వ్యవహరించేది అని ఆ దేశ ప్రెసిడెంట్‌ అలెక్సాండర్‌ వ్యూకిక్‌ (President Aleksandar Vucic) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ సైతం స్పందించారు. తమ దేశ సరిహద్దుల్లోకి ఎవరు వచ్చినా కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే అన్నారు. ఏ వ్యక్తికికైనా ఒకే విధమైన నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో (Australian Open) డిఫెండింగ్ ఛాంపియన్‌గా జకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు జకోవిచ్.

Also Read: IND vs SA: బౌన్సర్లతో రెచ్చిపోయిన జాన్సెన్.. తగ్గేదెలా అన్న బుమ్రా! అంపైర్ జోక్యం చేసుకోవడంతో..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News