Mohammad Hafeez BCCI: బీసీసీఐకి సాటి మరేదీ లేదు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ ప్రశంసల వర్షం!

IND vs PAK, Former Pakistan captain Mohammad Hafeez praises BCCI. బీసీసీఐపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ హఫీజ్‌ ప్రశంసల వర్షం కురిపించారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 3, 2022, 11:51 AM IST
  • బీసీసీఐకి సాటి మరేదీ లేదు
  • పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ ప్రశంసల వర్షం
  • ప్రతీకారం తీర్చుకొవాలి పాక్
Mohammad Hafeez BCCI: బీసీసీఐకి సాటి మరేదీ లేదు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ ప్రశంసల వర్షం!

IND vs PAK, Former Pakistan captain Mohammad Hafeez praises BCCI: ప్రపంచ క్రికెట్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధనిక బోర్డు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారీగా ఆదాయం పొందుతుంది. ఐపీఎల్ 2022 ద్వారానే భారీగా ఆదాయం వచ్చింది. అదే సమయంలో ఆటగాళ్లకు చెల్లించే ఫీజు కూడా భారీగానే ఉంటుంది. మొత్తానికి అన్ని బోర్డులతో పాటుగా ఐసీసీని కూడా బీసీసీఐ శాసించే స్థితిలో ఉంది.  ఈ క్రమంలో బీసీసీఐపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ హఫీజ్‌ ప్రశంసల వర్షం కురిపించారు.

సంపదను వృద్ధి చేయడంలో బీసీసీఐకి సాటి మరేదీ లేదు అని మహమ్మద్‌ హఫీజ్‌ అన్నారు. టీమిండియాను 'లాడ్లాస్' అని పేర్కొన్నారు. తాజాగా మహమ్మద్‌ హఫీజ్‌ తన ట్విట్టర్‌లో ఓ వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో హఫీజ్‌ మాట్లాడుతూ... 'నాకు ఎక్కువ విషయాలు తెలియవు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. సమాజంలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారో వారిని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. వారికి ఎక్కువ అభినందనలు వస్తుంటాయి. అంతేకాదు అండదండలు అన్ని ఉంటాయి' అని అన్నారు. 

'భారత్ సంపదను సృష్టించే దేశం. ప్రపంచంలో ఎక్కడ ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినా భారత్‌ స్పాన్సర్‌ చేస్తే జాక్‌పాట్‌ కొట్టినట్లే. ఆదాయం భారీగా ఉంటుంది. ఇలాంటి విషయాలను ఎవరూ కాదనలేరు. అందుకే టీమిండియాను లాడ్లాస్ (పాంపర్డ్) అని పిలుస్తా. ఎందుకంటే సంపదను వృద్ధి చేయడంలో బీసీసీఐకి సాటి మరేదీ లేదు. భారత జట్టు బాగా ఆడటం వల్లనే ఇదంతా సాధ్యం అవుతుంది' మహమ్మద్‌ హఫీజ్‌ చెప్పారు. 

యూఏఈ వేదికగా ప్రస్తుతం ఆసియా కప్‌ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో భాగంగా ఇదివరకే దాయాది దేశాలు భారత్‌, పాకిస్తాన్ తలపడగా.. ఆదివారం సూపర్‌-4లో మరోసారి ఢీ కొట్టనున్నాయి. ఈ మెగా మ్యాచ్ కోసం మరోసారి అందరూ ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే పాకిస్తాన్‌పై ఆధిపత్యం కొనసాగించాలని భారత్ చూస్తుంటే.. ప్రతీకారం తీర్చుకొవాలి పాక్ చూస్తోంది. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. 

Also Read: IND vs PAK: భారత్‌ అరుదైన రికార్డును బ్రేక్ చేసిన పాకిస్తాన్‌.. టాప్‌లో శ్రీలంక!

Also Read: Telangana Jobs: రేపటి నుంచే వరుస నోటిఫికేషన్లు! తెలంగాణ నిరుద్యోగులకు పండగే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News