December Last Week Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కదలికలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఏర్పడే ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడుతుంది అయితే రాబోయే ఆరు రోజుల్లో మొత్తం నాలుగు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర, కుజ, బుధ, గురు గ్రహాలు సంచారం చేయనున్నాయి. డిసెంబర్ 25న శుక్రుడు వృశ్చిక రాశిలోకి చేయబోతున్నాడు. డిసెంబర్ 27న కుజుడు, డిసెంబర్ 28న బుధుడు, డిసెంబర్ 31న గృహస్పతి ఇలా 4 గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ గ్రహాలు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
మేష రాశి:
గ్రహాల సంచారం కారణంగా మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మనసులో సంతోషం పెరగడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది దీంతోపాటు వ్యాపారాలు కూడా చాలావరకు మెరుగుపడతాయి. ఇక ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ గ్రహాల సంచారం కారణంగా ఉపశమనం లభిస్తుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ గ్రహాల సంచారం కారణంగా మానసిక సమస్యలు రావడమే కాకుండా ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ సమయంలో సహనంగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసే వారికి అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో శ్రమ పెరగడమే కాకుండా ఎలాంటి అన్ని పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు.
కర్కాటక రాశి:
ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా అన్ని పనుల్లో అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంతేకాకుండా అధిక కోపం కారణంగా సంభాషణలో సమతుల్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు స్వీయ యంత్రాలలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో పలు రకాలు జాగ్రత్తలు పాటించాలి. దీంతోపాటు మీ తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
సింహరాశి:
సింహ రాశి వారు ఈ నాలుగు గ్రహాల సంచారం కారణంగా పూజలపై ఎక్కువ ఆసక్తి చెబుతారు. దీంతోపాటు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో బాగోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సపోర్టు లభించి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసే వారి విషయానికి వస్తే స్నేహితుల మద్దతు లభించి మంచి లాభాలు పొందుతారు.
కన్యారాశి:
కన్యా రాశి వారి ఈ సమయంలో కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అంతేకాకుండా పిల్లలనుంచి కూడా అనేక శుభవార్తలు వింటారు. అయితే మీరు పిల్లల ఆరోగ్యం బాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వ్యాపారాల్లో స్నేహితుల మద్దతు లభించి ఊహించని లాభాలు పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి