Today Rashifal (2024 january 26): ఈరోజు స్నేహితులతో కాలక్షేపం చేస్తారు..ఈ రాశివారు జాగ్రత్త పడకపోతే నష్టాలు తప్పవు..

Today Horoscope Telugu:ఈ రాశివారు స్నేహితులతో కాలక్షేపం చేసేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ పని ప్రదేశాల్లో గతంలో చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చకుంటారు. ఈ రాశివారు ఆర్థికంగా లాభపడే అవకాశం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 08:11 AM IST
Today Rashifal (2024 january 26): ఈరోజు స్నేహితులతో కాలక్షేపం చేస్తారు..ఈ రాశివారు జాగ్రత్త పడకపోతే నష్టాలు తప్పవు..

Today Horoscope Telugu: ఈ రాశివారు స్నేహితులతో కాలక్షేపం చేసేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ పని ప్రదేశాల్లో గతంలో చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చకుంటారు. ఈ రాశివారు ఆర్థికంగా లాభపడే అవకాశం. 

మేషం..
మేషరాశి రాశిచక్రాల్లో మొదటిది, ఈ రాశివారికి జోతిష్యం ప్రకారం మిశ్రమంగా ఉంటుంది. మీ పని ప్రదేశంలో మీ ప్రవర్తన సమస్యలను తెలుస్తుంది. ఈరోజు మేషరాశివారికి ఆర్థిక సమస్యలు. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్త, లేకుంటే మీరు తర్వాత నష్టాలు తప్పవు.

వృషభం..
డబ్బు లావాదేవీల్లో అచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశివారు అప్పు ఇవ్వకూడదు. మూలధనం పెట్టేటప్పుడు జాగ్రత్త.. లేకుంటే నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు తప్పవు. పనిప్రదేశంలో ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది.  

మిథునరాశి..
మిథునరాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో విజయావకాశాలు మెండు. ఆర్థికంగా లాభపడతారు. కానీ, ఈ రోజు మీరు కుటుంబం నుంచి గొడవలు వచ్చే అవకాశం తప్పదు. మీరు కార్యాలయంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. 

కర్కాటకం..
కర్కాటక రాశివారు ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వారికి లాభదాయకమైన రోజు. కర్కాటక రాశివారు పనిప్రదేశంలో కాస్త కష్టం ఎక్కువ పడాల్సి ఉంటుంది. సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అనవసర చర్చలకు దిగకుండా ఉంటే మంచిది.  

సింహం..
విద్యార్థులకు ఈ రోజు శుభప్రదం. ఈరాశికి చెందినవారు పరీక్షలలో విజయం వరిస్తుంది. తోబుట్టువుల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఆర్థిక అంశాల గురించి ఆందోళన చెందవచ్చు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి.

కన్యారాశి..
ఈ రాశివారికి పని ప్రదేశంలో మానసిక ప్రశాంతతను లభిస్తుంది. పాత సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు. కొన్ని కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని వరిస్తాయి. ఈ రోజు మీరు ఎలాంటి  సమస్యలను ఎదుర్కోరు. 

తుల రాశి..
జోతిషం ప్రకారం ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి అవుట్ డోర్ ప్లాన్ ఉండొచ్చు. మీరు పనిప్రదేశంలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. పని అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు చిక్కులు తప్పవు. 

వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు పని ప్రదేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. తెలివిగా పెట్టుబడి పెట్టండి. పనికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు, దీనివల్ల ప్రయోజనం పొందుతారు. వీరికి కలిసివస్తుంది ఈరోజు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. 

Also read:  Guru Pushya Yoga 2024: ఈరోజు పుష్యపౌర్ణమి, గురుపుష్య యోగం.. ఇలా చేస్తే కటికదరిద్రుడైనా కుభేరయోగం..!

ధనుస్సు రాశి..
ధనప్సు రాశివారి ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ప్రతిదీ ఆలోచనాత్మకంగా అడుగు వేయండి. సులభంగా సాధించబడుతుంది. మనసు ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేసేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. 

మకరం..
మకరరాశివారు సహోద్యోగుల సహాయంతో పని సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ఓర్పుతో నిర్ణయాలు తీసుకుంటే విజయం మీదే. 

కుంభం..
వ్యాపార, ఆర్థిక విషయాలు సంక్లిష్టంగా మారవచ్చు. సోదరులు నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కానీ, పని ప్రదేశంలో ఈ రాశివారు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు. 

మీనం :
మీనరాశివారు వ్యాపార రంగంలో కొన్ని ఆర్థిక ఒప్పందాలు చేసుకోవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పని ప్రదేశంలో కూడా మీ సానుకూల వైఖరిని అందరూ ఇష్టపడతారు. 

Also read:  Vastu Tips: ఇంట్లోకి రాగానే టెన్షన్ మొదలవుతుందా? ఇది వాస్తు దోషమా? తప్పక తెలుసుకోండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News