Horoscope Today: ఇవాళ్టి మీ రాశిఫలాలు తెలుసుకోండి, ఆ రాశివారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే

Horoscope Today: గ్రహాల కదలిక, వివిధ రాశుల్ని బట్టి వ్యక్తుల రాశిఫలాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సాధారణంగా ఏరోజు తమకు ఎలా ఉందనేది తెలుసుకునే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఈ నేపధ్యంలో మీమీ రాశులవారికి ఇవాళ ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా  ఈ రాశివారైతే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2021, 07:02 AM IST
 Horoscope Today: ఇవాళ్టి మీ రాశిఫలాలు తెలుసుకోండి, ఆ రాశివారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే

Horoscope Today: గ్రహాల కదలిక, వివిధ రాశుల్ని బట్టి వ్యక్తుల రాశిఫలాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సాధారణంగా ఏరోజు తమకు ఎలా ఉందనేది తెలుసుకునే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఈ నేపధ్యంలో మీమీ రాశులవారికి ఇవాళ ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా  ఈ రాశివారైతే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

మేషరాశి : ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్ధికంగా ఫరవాలేదు. ఆరోగ్యపరంగా బాగుటుంది. ముఖ్యంగా మానసిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే పడనివారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే అనర్దాలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది.

వృషభ రాశి : ఈ రాశివారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న సమస్యలే పెద్దవి కాగలవు. ఇక మానసికంగా ధృడంగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్ధులకు మంచిరోజు. సరైన అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అధికారులతో అప్రమత్తత అవసరం.

మిథున రాశి : ఈ రాశివారికి పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలత, మరికొన్ని విషయాల్లో ప్రతికూలం ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్య పరిష్కారమై చికాకు పోతుంది. కీలకమైన వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం సమస్యలు ఎదుర్కొంటారు. 

కర్కాటక రాశి : ఈ రాశివారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, ఆర్దికంగా బాగుంటుంది. అటు ఆధ్యాత్మికంగా కూడా సమయం వెచ్చిస్తారు. ముఖ్యమైన భక్తి సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. 

సింహ రాశి : ఈ రాశివారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే కొన్ని సమస్యల్ని అధిగమించగలరు. ఉద్యోగులతై పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. 

కన్యరాశి : ఈ రాశివారికి పరిస్థితులు దాదాపుగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆర్ధికంగా బాగుంటుంది. డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులైతే అధికారుల్నించి ప్రశంసలు పొందుతారు. 

తులరాశి : ఈ రాశివారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా మంచి ఫలితాలుంటాయి. కుటుంబంలో ప్రశాంతత, కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించే పరిస్థితి ఉంటుంది. దూర ప్రయాణాలు తప్పవు. 

వృశ్చిక రాశి : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో సానుకూల పరిస్థితులు ఉండవు. చేపట్టాల్సిన పనుల్లో అవరోదాలు ఎదురవుతాయి. అయితే కష్టపడితే ఆ పని పూర్తవుతుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏ విధమైన సమస్య ఉండదు.

ధనుస్సు రాశి : ఈ రాశివారికి సానుకూలంగానే ఉంటుంది. ఏ రంగంలో వారికైనా అవరోధాలు తప్పవు. కానీ ఈ రాశివారు ఆ అవరోధాల్ని అధిగమించగలరు. కీలకమైన పనుల్ని చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి కానీ ఎక్కువగా కష్టపడాలి. ఆర్ధికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి : ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్ధికంగా బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబసభ్యుల సహకారం ప్రతి పనిలో ఉంటుంది. అయితే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి తీసుకోవల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ఇతరుల విషయాల్లో అంటే అనవసర విషయాల్లో జోక్యం మంచిది కాదు. 

కుంభరాశి : ఈ రాశివారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆర్ధికంగా పెద్దగా ఆశించిన ప్రయోజనం ఉండదు. ఆరోగ్యపరంగా మాత్రం బాగుంటుంది. ముఖ్యంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదురైనా..కష్టపడితే ఆ ఇబ్బందులు దూరమౌతాయి.

మీనరాశి : ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. ఏ విధమైన సమస్యలు ఎదురుకావు. అయితే ఆర్ధికంగా కాస్త ఇబ్బంది కలుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగి సమస్య తలెత్తుతుంది. అందుకే ఆర్ధిక లావాదేవీల విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మరోవైపు మీ శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

Also read: Todays Horoscope: ఇవాళ్టి రాశిఫలాలు..ఆ రాశివారికి పట్టుకుంటే బంగారమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News