Vaikunta ekadashi sarvadarshanam in Tirupati | తిరుపతి: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లను ఈసారి స్థానికులకు మాత్రమే అందివ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ బోర్డు అదనపు ఈఓ ధర్మారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్ల ఏర్పాట్లను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్న కరుణాకర్ రెడ్డి.. కౌంటర్ల వద్ద తోపులాటకు తావులేకుండా, స్థానికులనే అనుమతించేలా చూడాల్సిందిగా అధికారులకు సూచించారు.
ఇప్పటివరకు ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ సోకలేదు: ధర్మా రెడ్డి
కౌంటర్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... డిసెంబరు 25న ఉదయం నుంచి జనవరి 3వ తేదీ రాత్రి 12 గంటల వరకు టీటీడీ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించిందని తెలిపారు. కొవిడ్-19 నిబంధనల కారణంగా రోజుకు 17 నుంచి 18 గంటల్లో 30 నుంచి 35 వేల మందికి మించి దర్శనానికి అనుమతించే అవకాశం లేదన్నారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ 19 నిబంధనలు కఠినంగా పాటిస్తున్నందు వల్లే దేవాలయంలో పునఃదర్శనం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ సోకలేదని ఈవో ధర్మా రెడ్డి ( TTD EO Dharma Reddy ) స్పష్టంచేశారు. టీటీడీ సిబ్బందిలో కొంతమందికి మొదట్లో కరోనా సోకినప్పటికీ.. ఆ తర్వాత క్రమక్రమంగా కరోనాను నివారించగలిగామని అన్నారు. రోజుకు సగటున 200 మంది భక్తులకు పరీక్షలు చేస్తున్నా.. అందులో ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ లేకపోవడమే టీటీడీ ( TTD ) తీసుకుంటున్న చర్యలకు నిదర్శనం అని తెలిపారు.
Also read: Tirumala: ఆన్‌లైన్‌లో ‘వైకుంఠ ద్వార దర్శనం’ టికెట్లు
స్ధానికేతరులు వైకుంఠ ఏకాదశి సర్వదర్శనానికి రావద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి..
రోజుకు 30 నుంచి 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని.. అందులో రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశామని తెలిపారు. ఒకవేళ సర్వ దర్శనం టోకెన్లు ( TTD Sarvadarshanam tokens ) అందరికీ అందుబాటులో ఉంటే.. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో తిరుపతిలో కోవిడ్-19 ( COVID-19 ) నిబంధనల ఉల్లంఘనకు దారితీస్తుందనే ఉద్దేశంతోనే వారిని అనుమతించడం లేదని అన్నారు. తిరుమలలో తొక్కిసలాటలు జరగకుండా శాంతి భద్రతలు దెబ్బతినకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా స్ధానికేతరులు వైకుంఠ ఏకాదశి సర్వదర్శనానికి రావద్దని ఆయన టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
Also read : Karthika Purnima: కార్తిక మాసం ఎందుకు పవిత్రం ? కార్తిక పౌర్ణమినాడే 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
TTD Darshanam tickets: స్థానికులకే వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు: టీటీడీ