Telugu Rasi Phalalu 2024: 2023 సంవత్సరానికి ముగింపు పలికే సమయం వచ్చింది మరికొన్ని రోజుల్లోనే 2024 కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి అన్ని జాతకాల వారికి ఆసక్తి ఉంటుంది. 2024 లో కొన్ని రాశుల వారికి ప్రారంభ నెల నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. కొత్త సంవత్సరంలో కొన్ని శుభయోగాలు జరగడం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా కుబేరుడు అనుగ్రహం కలిగి ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు. రాబోయే కొత్త సంవత్సరం ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారు 2024 సంవత్సరంలో ఎంతో సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపార పరంగా అనేక రకాల విజయాలు సాధిస్తారు. ఐటి మీడియా బ్యాంకింగ్ రంగలకు సంబంధించిన వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక విషయాలపరంగా చూస్తే.. ఈ సమయంలో మేష రాశి వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా డిసెంబర్ 31వ తేదీ నుంచి బృహస్పతి గ్రహం మేషరాశిలో సంచార దశలో ఉండబోతోంది. దీనికి కారణంగా మరిన్ని ప్రయోజనాలు పొందుతారు.
కర్కాటక రాశి:
రాబోయే కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారిపై కూడా కుబేరుడు అనుగ్రహం చూపబోతున్నాడు. దీనికి కారణంగా గత సంవత్సరంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కంటే ఈ సంవత్సరంలో మెరుగుపడతాయి. అంతేకాకుండా దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో వీరు ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. జీవితంలో ఆనందం శ్రేయస్సు లగ్జరీ ప్రేమ అంశాలకు ఎలాంటి లోటు ఉండదు. భౌతికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.
తులారాశి:
రాబోయే 2024 కొత్త సంవత్సరం తులా రాశి వారికి కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి వారు అనుకోని లాభాలు పొందుతారు ముఖ్యంగా వృత్తి జీవితంలో అనేక రకాల లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు భాగస్వామితో ఇంతకుముందున్న గొడవలన్నీ పరిష్కారం అవుతాయి. బృహస్పతి అనుగ్రహం వల్ల వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
వృశ్చిక రాశి:
2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. గురు గ్రహ అనుగ్రహం వల్ల వీరు వ్యాపారాల్లో కూడా ప్రయోజనాలు పొందుతారు. ఇక అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Kubera Graces 2024: 2024లో ఈ రాశుల వారిపై కుబేరుడి అనుగ్రహం..వీరికి సంపాదన, డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు!