Sun Transit Bad Effect: రాశిని మార్చబోతున్న సూర్యుడు.. జూన్ 15 నుండి ఈ రాశులవారికి ఇబ్బందులు తప్పవు!

Sun Transit June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 15న సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారు లాభపడగా, మరికొందరికి హాని కలుగుతుంది. సూర్యుని రాశి మారడం వల్ల కలిగే అశుభ ప్రభావం ఏ రాశులపై కనిపిస్తుందో తెలుసుకుందాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 11:54 AM IST
Sun Transit Bad Effect: రాశిని మార్చబోతున్న సూర్యుడు.. జూన్ 15 నుండి ఈ రాశులవారికి ఇబ్బందులు తప్పవు!

Sun Transit in Gemini 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు.. దాని ప్రభావం 12 రాశిచక్ర గుర్తుల జీవితంపై కనిపిస్తుంది. ఈ ప్రభావం మంచి లేదా చెడు కావచ్చు. జూన్ 15న సూర్యుడు వృషభరాశిని విడిచి మిథునరాశిలోకి (Sun Transit in Gemini 2022) ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిలో సూర్యుడు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది. కొన్ని రాశులవారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

ఈ రాశులపై అశుభ ప్రభావం
మేషం (Aries): సూర్యుని సంచార ప్రభావం ఈ రాశి వారిపై మిశ్రమంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే తప్పకుండా పెద్దల సలహా తీసుకోండి. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అలాగే, ఈ కాలంలో ఎవరికీ రుణం ఇవ్వవద్దు లేదా రుణాలు తీసుకోవద్దు. 

కర్కాటకం (Cancer): ఈ వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. పనిలో వైఫల్యం ఉంటుంది, దాని కారణంగా మీరు కలత చెందుతారు.  ఎవరికైనా రుణం ఇవ్వడం మానుకోండి, లేకపోతే మీరు నష్టపోవాల్సి రావచ్చు. పోటీ పరీక్షల కోసం విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కాలంలో వైవాహిక జీవితంలో కూడా హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 

వృషభం(Taurus): ప్రస్తుతం సూర్యుడు వృషభరాశి నుండి మిథునరాశిలోకి సంచరిస్తున్నాడు. దీని ప్రభావం వృషభ రాశి వారిపై కూడా కనిపిస్తుంది. వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. పిల్లల వైపు ఉద్రిక్తత ఉండవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. ఈ కాలంలో కష్టపడి పని చేసినా ఫలితం ఉండదు. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. 

మీనం (Pisces): ఈ రాశిపై మిశ్రమ ప్రభావం కనిపిస్తుంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ సమయంలో వ్యాపారస్థులు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అజాగ్రత్త ఉన్న మీకు హాని తప్పదు. 

తుల (Libra): ఈ రాశి వారు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈసారి కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. పరీక్ష కోసం కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో పూజ చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో మార్పులు నష్టాలకు దారితీస్తాయి. 

Also Read: Good Luck Gifts: వీటిని బహుమతిగా పొందితే.. జీవితంలో అదృష్టమే ఇగ! పొరపాటున కూడా వీటిని ఇవ్వకూడదు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News