Sun Transit in July 2022: జూలై 16 నుండి ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు!

Sun Transit in July 2022: సూర్యుడు రాశిని మార్చబోతున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ముఖ్యంగా మేషరాశివారిపై ఎలా ఉండబోతుందో చూద్దాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 10:11 AM IST
  • జూలై 16న కర్కాటక రాశిలోకి సూర్యుడు
  • మెుత్తం 12 రాశులపై ప్రభావం
Sun Transit in July 2022: జూలై 16 నుండి ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు!

Sun Transit in July 2022: సూర్యుడు రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే కర్క సంక్రాంతి అని కూడా అంటారు. కర్కాటకరాశిని చంద్రుడు పరిపాలిస్తాడు. ఈ నేపథ్యంలో సూర్యుడు చంద్రుని ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా కొన్ని రాశులను ప్రభావితం చేస్తాడు. మేషరాశిపై సూర్య సంచారం ప్రభావం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడి 
కర్కాటక రాశిలో సూర్య సంచారం వల్ల మేష రాశి వారు ఏ రంగంలో పనిచేసినా అక్కడ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారుల్లోని వారు ఒత్తిడికి గురవుతారు. ఈ రాశివారిని ఒకదాని వెంట ఒకటి సమస్యలు వెంటాడతాయి. సమయమనం పాటించి సమస్యలను పరిష్కరించడానికి ఈ రాశివారు కృషి చేయాలి. మీ పనిలో అడగడుగునా ఆటంకాలు ఎదురువుతాయి. మీరు ఏపని తలపెట్టినా దానిని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇటువంటి పరిస్థితులలో మీరు ఓపికగా  సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. మీ ఆఫీస్ లేదా సమజంలోని వ్యక్తులు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని తప్పుబడతారు. 

ఆరోగ్యంపై శ్రద్ధ
ఆరోగ్య పరంగా చూస్తే శరీరంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇప్పటికే ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారు ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ వైవాహిక జీవితం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. దీనికి కారణంగా మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తువచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా భూమిని  కొనాలని ఆలోచిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. 

Also Read: Kali Controversy: మహాకాళి గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు? 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News