Sun Transit 2022 Effect: సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 16న సూర్యుడు మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి (Sun Transit in Cancer 2022) ప్రవేశిస్తాడు. ఈ సంచారం రాత్రి 11.11 గంటలకు జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించడాన్ని కర్క సంక్రాంతి అంటారు. కర్కాటక సంక్రాంతి రోజున స్నానం మరియు దానధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంది. సూర్యభగవానుడు జూలై 16 నుండి ఆగస్టు 17 ఉదయం వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. అనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.
మేషం (Aries): కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించడం వల్ల మేష రాశి వారికి మేలు జరుగుతుంది. వీరికి కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. వ్యాపారం సూపర్ గా ఉంటుంది.
వృషభం (Taurus): సూర్యుని రాశి మారడం వల్ల వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. మీకు నచ్చిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది.
మిథునం (Gemini): సూర్యుని స్థానం మార్పు మిథునరాశి వారు సానుకూల ఫలితాలను అందిస్తుంది. వీరి జీతం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది.
కర్కాటకం (Cancer): సూర్య సంచారం ప్రభావం ఈరాశివారికి లాభం చేకూరుస్తుంది. వ్యాపారాలలో పురోగతి మరియు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. జూలై 16 మరియు ఆగస్టు 17 మధ్య పెట్టుబడి పెట్టడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు.
Also Read: Venus Transit Effect: జూలై 13న మిథునరాశిలోకి శుక్రుడు... ఈ రాశులవారికి బంఫర్ బెనిఫిట్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook