Sun transit 2023: సూర్య గోచారంతో ఇవాళ్టి నుంచి మార్చ్ 15 వరకూ మీనరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరగనుంది

Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం నిర్ణీత సమయంలో వివిధ గ్రహాలు రాశి మారుతుంటాయి. ఫలితంగా అన్ని రాశుల జీవితాలపై ప్రభావం పడుతుంటుంది. సూర్యుడి గోచారం మీనరాశి జాతకంపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 13, 2023, 06:22 AM IST
Sun transit 2023: సూర్య గోచారంతో ఇవాళ్టి నుంచి మార్చ్ 15 వరకూ మీనరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరగనుంది

మీనరాశి జాతకం కలిగినవారు కెరీర్‌లో విజయం కోసం కష్టపడాల్సి వస్తుంది. విదేశీ యాత్రలు చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు బదిలీలుంటాయి. సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన మీనరాశిలో ప్రవేశించనున్నాడు.

గ్రహాలకు రాజైన సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ అంటే ఇవాళ ఉదయం 9.47 నిమిషాలకు కుంభ రాశిలో ప్రవేశించి మార్చ్ 15వ తేదీ వరకూ అందులోనే ఉంటాడు. కుంభ సంక్రాంతి రూపంలో జరగనున్న సూర్య పరివర్తనం కారణంగా చాలా మహత్యం కలుగుతుందంటారు. అక్కడ కుంభరాశి మరో అధిపతి శని ముందు నుంచే ఉండటమే కారణం. సూర్యుడి గోచారం మీనరాశి జాతకులకు మంచి మంచి అవకాశాల్ని తీసుకురానుంది.

మీనరాశి జాతకులకు ఉద్యోగంలో బదిలీ ఉంటుంది. దీనికోసం మానసికంగా సంసిద్ధులై ఉండాలి. త్వరలో విదేశీ యాత్ర చేసే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా మీ కష్టార్జితంపై ఎక్కువగా ఆధారపడాలి. ఏదైనా డీల్ కోసం ఎదురుచూస్తుంటే..అందుకోసం ఎక్కువ కష్టపడాలి. వ్యాపారులకు ఫిబ్రవరి 27 వరకూ ఉన్న సమయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

మీనరాశి వారికి ఫిబ్రవరి 13 నుంచి మార్చ్ 15 వరకూ ఖర్చులు పెరగవచ్చు. అయితే వృధా ఖర్చులేవీ ఉండవు. చదువు, విదేశీ ప్రయాణం లేదా పాత అప్పులు తీర్చడం జరుగుతుంది. అయితే ఏ విషయంలోనైనా ఆర్భాటపు ఖర్చులు లేకుండా చూసుకోవాలి. బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాలి. విజయం కోసం సూర్యుడిని నిర్ణీత సమయంలో నీటితో ఆర్ధ్యం ఇవ్వాలి. తండ్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండవద్దు. నెగెటివ్ వైఖరిని విడనాడాలి. ఎందుకంటే తప్పుడు పనుల్లో చిక్కుకుంటే..సూర్య, శని గ్రహాల యుతితో మీరు చట్టం ఉచ్చులో బిగుసుకుపోతారు. బరువు పెరుగుతుంటే థైరాయిడ్ లేదా డయాబెటిస్ పరీక్ష చేయించుకోవాలి. మాదక ద్రవ్యాల వినియోగాన్ని వెంటనే మానేయాలి. వాహన ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. అప్రమత్తంగా ఉండాలి. 

Also read: Mahashivatri 2023: మహాశివరాత్రి నాడు ఈ వస్తువులు దానం చేస్తే.. ఇక మీ ఇల్లు అంతా డబ్బే డబ్బు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News