Surya Gochar 2023 in Mithun rashi: నెలకొకసారి గ్రహాల రాజు అయిన సూర్యుడు తన రాశిని మారుస్తాడు. మరో 8 రోజుల్లో అంటే జూన్ 15న, ఉదయం 06:17 గంటలకు ఆదిత్యుడు మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. భానుడి సంచారం వల్ల మిథునంతో సహా కొన్ని రాశుల అదృష్టం ప్రకాశించనుంది. సూర్యుడి గోచారం వల్ల వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహం: సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి ఆదిత్యుడి సంచారం శుభప్రదమనే చెప్పాలి. వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు లవ్ లో సక్సెస్ అవుతారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది.
కుంభం: సూర్యుని సంచారం కుంభ రాశి వారికి వరమనే చెప్పాలి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
మకరం: సూర్యుని సంచారం మీకు ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీరు రుణ విముక్తి పొందుతార. నిరుద్యోగులకు మంచి జాబ్ వస్తుంది.
Also Read: Mercury transit 2023: ఈరోజు నుండి ఈ 4 రాశుల జీవితం అల్లకల్లోలం.. మీరున్నారా?
కర్కాటకం: మిథునరాశిలో సూర్యుని సంచారం వల్ల కర్కాటక రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. ఈ సమయంలో పాత పెట్టుబడుల ద్వారా లాభాలు ఉంటాయి.
కన్య : ఆదిత్యుడి సంచారంతో కన్యారాశి వారి అదృష్టం కూడా సూర్యునిలా ప్రకాశిస్తుంది. మీ కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
Also Read: Rajyog: మరికొన్ని రోజుల్లో అరుదైన రాజయోగం.. ఈ 4 రాశులవారు కింగ్ లా బతకడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook