Sun Mercury Jupiter Moon Transit: వందేళ్ల తరువాత మహా సంయోగం.. ఆ 4 రాశులకు మహర్దశే

Sun Mercury Jupiter Moon Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం మీనరాశిలో 100 ఏళ్ల తరువాత మహాద్భుతం చోటుచేసుకోనుంది. ఫలితంగా 4 రాశుల జీవితం పూర్తిగా మారిపోనుంది. ఊహించని ధన సంపదలతో తులతూగనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2023, 09:25 AM IST
Sun Mercury Jupiter Moon Transit: వందేళ్ల తరువాత మహా సంయోగం.. ఆ 4 రాశులకు మహర్దశే

Sun Mercury Jmoon Transit Maha Samyogam : జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిశ్చిత రాశిలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే కొన్నిరాశులపై లాభాల్ని అందిస్తే, మరికొన్ని రాశులకు ఇబ్బందుల్ని కలుగజేయనుంది. మీనరాశిలో బుధ, గురు, సూర్య గ్రహాల యుతి ప్రభావం గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం గ్రహాలకు గురువుగా భావించే గురుడు మీనరాశిలో ఉన్నాు. అటు బుధ, సూర్య గ్రహాలు కూడా ఇదే రాశిలో ఉన్నాయి. మార్చ్ 22వ తేదీన చంద్రుడు కూడా గోచారం చేసి మీన రాశిలో ప్రవేశించనున్నాడు. అంటే ఒకే రాశిలో ఒకే సమయంలో గురు, బుధ, సూర్య, చంద్ర గ్రహాలు ఉండటం అత్యంత మహాద్భుతంగా మారనుంది. ఏకంగా 4 శుభ యోగాలు ఏర్పడతాయి. గజకేసరి యోగం, నీచభంగ యోగం, బుధాదిత్య యోగం, హంసయోగం ఏర్పడనున్నాయి. 100 ఏళ్ల తరువాత 4 రాజయోగాలతో మహా సంయోగం ఏర్పడటం ఇదే తొలిసారి. ఫలితంగా 4 రాశుల జీవితం స్వర్ణమయం కానుంది. సకల సంపదలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు.

కన్యా రాశి.. 

వందేళ్ల తరువాత ఏర్పడనున్న ఈ మహా సంయోగంతో కన్యా రాశి జీవితంలో గోల్డెన్ డేస్ వచ్చినట్టే అర్ధం చేసుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అన్ని వైపుల్నించి విజయం ప్రాప్తిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఏదైనా పెద్ద డీల్ చేయడం ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తారు. బాగస్వామ్య వ్యాపారంలో విజయం ఉంటుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం రెండూ బాగుంటాయి. 

వృషభ రాశి.. 

బుధ, సూర్య, గురు, చంద్ర గ్రహాల యుతితో ఏర్పడనున్న మహా సంయోగం వందేళ్ల తరువాత ఇదే. ఫలితంగా వృషభ రాశి జీవితంలో అత్యంత శుభ ఫలాలు అందనున్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. ఆర్ధిక పరిస్థితి ఊహించనివిధంగా మెరుగుపడుతుంది. సమాజంలో లేదా నలుగురిలో మీ ఆకర్షణ పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలుంటాయి. పాత పెట్టుబడులు లాభాల్ని అందిస్తాయి.

కుంభ రాశి.. 

4 రాజయోగాలతో వందేళ్ల తరువాత ఏర్పడనున్న మహా సంయోగంతో కుంభరాశి జీవితాలకు ఊహించని లాభముంటుంది. శని సాడే సతి కారణంగా జీవితంలో ఎదురయ్యే కష్టాల్నించి విముక్తి పొందవచ్చు. అదృష్టం తోడవుతుంది. పనుల్లో విజయం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మిథున రాశి.. 

మిథున రాశి జీవితంలో రాజయోగం కారణంగా పనుల్లో విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, బదిలీ, జీతంలో పెరుగుదల ఉంటుంది. అధికారం, ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఏ విధమైన సమస్యలు దరిచేరవు.

Also Read: Rahu ketu Transit 2023: ఏడాదిన్నర తరువాత మళ్లీ ఆ 3 రాశులకు నరకం చూపించనున్న రాహుకేతువులు

Also Read: Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News