Astrology: 12 ఏళ్ల తర్వాత సూర్యుడు-గురుడు కలయిక.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Planet Conjunction 2024: త్వరలో మేషరాశిలో సూర్యుడు మరియు గురుడు కలయిక సంభవించోతుంది. వీరిద్దరి సంయోగం సుమారు 12 ఏళ్ల తర్వాత జరగబోతుంది. దీంతో మూడు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2024, 05:47 PM IST
Astrology: 12 ఏళ్ల తర్వాత సూర్యుడు-గురుడు కలయిక.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Sun and Jupiter Conjunction in Aries 2024: పంచాంగం ప్రకారం, గ్రహాల రాజైన సూర్యభగవానుడు వచ్చే నెలలో మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. అప్పటికే అదే రాశిలో బృహస్పతి ఉంటాడు. దీంతో మేషరాశిలో సూర్యుడు మరియు గురుడు కలయిక సంభవించబోతుంది. ఈ మహా సంయోగం సుమారు పుష్కర కాలం తర్వాత జరగబోతుంది. వీరిద్దరి కలయిక వల్ల ఏయే రాశులవారు లాభం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

మీనరాశి
మేషరాశిలో బృహస్పతి మరియు సూర్యభగవానుడు మైత్రి వల్ల మీనరాశి వారి సంపద వృద్ధి చెందుతుంది. మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఉద్యోగులకు శాలరీ పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభిస్తుంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. మీరు కోరుకున్నంత ధనం పొందుతారు. 
మకరరాశి
ఏప్రిల్‌లో గ్రహాల సంయోగం మకరరాశి వారు లాభపడతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. 
ధనుస్సు రాశి
మేష రాశిలో సూర్యుడు మరియు గురుడు కలయిక కారణంగా మేషరాశి వారు ఊహించని ప్రయోజనాలు పొందబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఎంతో కాలం ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Saturn Rise 2024: మరో వారం రోజుల్లో ఉదయించబోతున్న శని.. ఈ 3 రాశులకు అదృష్ట తలుపులు తెరుచుకోవడం పక్కా..

Also Read: Mars Transit 2024: కుంభ రాశిలోకి కుజుడు.. ఈ రాశులవారికి త్వరలోనే లగ్జరీ లైఫ్ ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News