/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Sravana Somavaram 2022: రేపే అంటే జూలై 18న శ్రావణ మాసం తొలి సోమవారం. ఈ రోజున ఉపవాసం పాటిస్తూ..శివారాధన చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. శివపూజ చేసేటప్పుడు తప్పనిసరిగా శ్రావణ సోమవారం వ్రత కథను (Sravana Somavaram  Vrat Katha) చదవడమో లేదా వినడమో చేయాలి. ఇలా చేయడం వల్ల వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాం. 

శ్రావణ సోమవారం వ్రత కథ
అమర్‌పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతడు శివభక్తుడు. సమాజంలో ఎంతో పేరు ఉన్నా ఆయనకు బిడ్డలు లేరనే బాధ తొలిచివేసేది. తర్వాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారనే నిత్యం ఆందోళన చెందేవాడు. కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ.. రోజూ సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు. ఇలా చాలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పింది. అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది. ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు. తల్లి పార్వతి అది ఒప్పుకోలేదు. శివుడిని ఏదోలాగా ఒప్పించింది.  

ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కలలో కనిపించి అతనికి కొడుకును ప్రసాదించాడు. అయితే ఆ కుమారుడు 16 ఏళ్లే  బతుకుతాడని మహాదేవుడు వరమిచ్చాడు. ఒక పక్క సంతోషంగా ఉన్నా.. మరో పక్క తక్కువ కాలం జీవిస్తాడనే విచారం వారు వ్యక్తం చేశారు. కానీ ఆ వ్యాపారి మాత్రం సోమవారం వ్రతం కొనసాగించాడు. శివ పూజను యథావిధిగా చేసేవాడు. శివుని దయతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు. అతనికి అమర్ అని పేరు పెట్టారు. 12 సంవత్సరాల వయస్సులో, అతను తన మామ దీప్‌చంద్‌తో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్లాడు. దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు.

ఒకరోజు అతను రాజు కుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్లాడు. తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండటంతో వరుడి తండ్రి ఆందోళనకు గురయ్యాడు. వివాహం జరగదేమోననే భయం అతన్ని వెంటాడింది. పెళ్లికొడుకు తండ్రి అమర్‌ని చూసి పెళ్లికొడుకుగా నటిస్తే..బోలెడు డబ్బు ఇస్తానని చెప్పాడు. దురాశతో మామ దీప్ చంద్ దానికి ఒప్పుకున్నాడు. అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్లయింది, నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని రాశాడు. ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తేల్చుకోండని చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తమామల ఇంటికి వెళ్లడానికి నిరాకరించింది. 

మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు. 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు. అన్నదానం, దానాలు, దక్షిణలతో బ్రాహ్మణులు సంతృప్తి చెందారు. ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడి కోరిక మేరకు అమర్ ప్రాణం విడిచింది.అమర్ మరణవార్త తెలిసి అతని మామ కన్నీరుమున్నీరుగా విలపించారు. చుట్టుపక్కల జనం గుమిగూడారు. శివుడు, పార్వతి అక్కడి నుండి వెళ్తున్నారు. దీప్‌చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి తల్లి తన బాధను తొలగించమని శివుడిని కోరింది. 

శివుడి మాత పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెప్పాడు. మీరు తిరిగి అతని బతికంచండి పార్వతిదేవి శివుడికి చెప్పింది. తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్‌ను పునర్ జీవితుడ్ని చేశాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, అమర్ మామతో కలిసి యువరాణి నగరానికి చేరుకుని అక్కడ యాగం నిర్వహించాడు. రాజు అమర్‌ని గుర్తించాడు. అతడిని ఇంటికి తీసుకెళ్లి తన కుమార్తెను అతని వెంట పంపించాడు. కుమారు సజీవంగా ఉండటం చూసి వ్యాపారి కుటుంబానికి అవధులు లేకుండా పోయింది. అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి, సోమవారం నాడు మీరు చేసిన వ్రతానికి ముగ్ధుడై..అమర్‌కు దీర్ఘాయువు ప్రసాదించినట్లు తెలిపాడు.  

Also Read: Jupiter in Pisces: మీనరాశిలో గురు గ్రహం వక్రమార్గం, ఆ మూడు రాశులకు జూలై 29 నుంచి ఏం జరుగుతుంది 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
Sravana First Somavaram on 18 July 2022: Read this vrat Katha during Shiva puja
News Source: 
Home Title: 

Sravana Somavaram 2022: రేపే శ్రావణ మాసం తొలి సోమవారం, వ్రత కథను తెలుసుకోండి

Sravana Somavaram 2022: రేపే శ్రావణ మాసం తొలి సోమవారం,  వ్రత కథను తెలుసుకోండి
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

జూలై 18న శ్రావణ మాసం తొలి సోమవారం 

ఈ రోజున శివుడిని పూజిస్తారు.
 

Mobile Title: 
Sravana Somavaram 2022: రేపే శ్రావణ మాసం తొలి సోమవారం, వ్రత కథను తెలుసుకోండి
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, July 17, 2022 - 09:58
Created By: 
Srinivas Samala
Updated By: 
Srinivas Samala
Published By: 
Srinivas Samala
Request Count: 
103
Is Breaking News: 
No