Rituals After Surya Grahanam: సూర్య గ్రహణం తర్వాత చేయాల్సిన పనులు

Rituals After Solar Eclipse: గ్రహణాలు వచ్చాయంటే అందరి దృష్టి ఆకాశం వైపే ఉంటాయి. గ్రహణానికి కొన్ని రోజుల ముందు నుంచే క్యూరియాసిటీ ప్రదర్శించే జనం... గ్రహణం పట్టింది మొదలు విడిచే వరకు ఆతృత... ఉత్సాహం రెండూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారంటే చాలు... ఆ కుటుంబంలోని అందరిలో తెలియని ఆందోళన నెలకొని ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 06:10 PM IST
  • గ్రహణం విడిచాక సంప్రదాయం ప్రకారం ఆచరించే నియమాలు
  • గ్రహణం ఏర్పడినప్పుడు సూత కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు
  • ఆలయాలపై కూడా గ్రహణ వేదన ప్రభావం
Rituals After Surya Grahanam: సూర్య గ్రహణం తర్వాత చేయాల్సిన పనులు

Rituals After Solar Eclipse: గ్రహణాలు వచ్చాయంటే అందరి దృష్టి ఆకాశం వైపే ఉంటాయి. గ్రహణానికి కొన్ని రోజుల ముందు నుంచే క్యూరియాసిటీ ప్రదర్శించే జనం... గ్రహణం పట్టింది మొదలు విడిచే వరకు ఆతృత... ఉత్సాహం రెండూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారంటే చాలు... ఆ కుటుంబంలోని అందరిలో తెలియని ఆందోళన నెలకొని ఉంటుంది. గ్రహణం విడిచాకే అంతా ఊపిరి పీల్చుకుంటారనే దానిలో ఎలాంటి అనుమానాలు అక్కర లేదు. ఇక గ్రహణం కాలంలో సైన్స్ పరంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే దానికంటే... పురాణాలు చెప్పే అంశాలపైనే అందరు దృష్టిసారిస్తారు. గర్భిణీ స్త్రీల విషయంలో సైన్స్ కంటే ఎక్కువ పండితులు చెప్పే వాటిని నమ్ముతారు జనం.

Rituals after Surya Grahanam: గ్రహణం విడిచాక ఆచరించే కొన్నింటిని చూద్దాం..
హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య రోజున సూర్యగ్రహణం.. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పతుంది. ఇక గ్రహణం పట్టే కాలానికి కొన్ని గంటల ముందు నుంచే వేదన ఉంటుంది. అప్పటి నుంచి మోక్ష కాలం వరకు సూతకాలమంటారు. ఆ సమయంలో ఎలాంటి పనులు చేయరు. గ్రహణం విడిచాక ఇంటిని శుభ్రపరిచాకే పవిత్ర కార్యక్రమాలు చేస్తారు. దాంతో పాటు సమీపంలోని నదులు.. చెరువులు... సముద్రాల్లో జనం పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఇది గ్రహణ ఆచారాల్లో ఓ భాగమని చెప్పవచ్చు. 

Pujas after Surya Grahan: దైవ దర్శనం.. ప్రత్యేక పూజలు..
అలాగే తమ కుటుంబసభ్యులు క్షేమంగా ఉండాలనే భావనతో పితృదేవతలను శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా వారి పేరు మీద బ్రాహ్మణులకు దాన, ధర్మాలు చేస్తారు. అంతేకాకుండా ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం.. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా గ్రహణకాలం కొన్ని రాశులు, నక్షత్రాల వారికి పనికిరాదంటే ఆలయాల్లో ప్రత్యేక శాంతి పూజలు, జపాలు చేయించి ఆయాగ్రహాల అనుగ్రహం కోసం దాన, ధర్మాలు చేస్తారు. ఇది మూఢనమ్మకమే అనే హేతువాదుల వాదనలను సైతం జనం లెక్క చేయరంటే గ్రహణమంటే భారతీయులకు ఎలాంటి భావన ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

ఇక ఆలయాలు కూడా గ్రహణ వేదన నుంచే మూసివేసి ఉంచుతారు. గ్రహణ కాలమంతా మలినమైనదని... దాంతో గర్బాలయంలో ఉండే మూర్తికి ఎలాంటి అపచారం జరగకూడదని మూసివేస్తారు. తదనంతరం ఆలయాల శుభ్రత, సంప్రోక్షణ అనంతరం దైవదర్శనాలకు అనుమతిస్తారు ఆలయాల నిర్వాహకులు. గ్రహణమంటేనే చెడు ప్రభావం చూపుతుందనే భావన సగటు భారతీయుల్లో ఉంటుంది. దాంతో ఆలయాలకు దైవ దర్శనానికి వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇక గ్రహణ కాలాన్ని (Solar Eclipse 2022) కూడా మాయమాటలు చెప్పి అమాయకుల నుంచి సొమ్ము చేసుకునే మోసగాళ్లు కూడా కోకొళ్లలుగానే ఉన్నారు. అలాంటి వారి పట్ల జనం జాగ్రత్తగా ఉండాలని జీ తెలుగు న్యూస్ హెచ్చరిస్తోంది.

Also read : Nature by Zodiac: ఈ ఐదు రాశుల అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం... ఇట్టే లవ్‌లో పడిపోతారు

Also read : Shani Amavasya 2022: నేడే శని అమావాస్య.. ఇకపై ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

Trending News