Shani Jayanti 2023: శని జయంతి రోజే 3 యోగాలు ఏర్పడబోతున్నాయి! ఈ రాశులవారికి పండగే..

Shani Jayanti 2023: ఈ సంవత్సరం శని జయంతి మే 19న వస్తోంది. కాబట్టి పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 13, 2023, 09:52 AM IST
Shani Jayanti 2023: శని జయంతి రోజే 3 యోగాలు ఏర్పడబోతున్నాయి! ఈ రాశులవారికి పండగే..

Shani Jayanti 2023 Date: జ్యేష్ఠ అమావాస్య రోజున శని జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం శని జయంతి మే 19 వస్తోంది. శని దేవుడి పుట్టిన రోజు సందర్భంగా ఈ జయంతిని జరుపుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని సాడే సతి, ధైర్య, మహాదశతో బాధపడేవారు తప్పకుండా శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు తీరుతాయి. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు శని దేవుడిని పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ సంవత్సరం వస్తున్న శని జయంతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇదే క్రమంలో గజకేసరి యోగం, శోభన యోగం, శష్ రాజ్ యోగం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ యోగాల వల్ల చాలా రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: Yashasvi Jaiswal IPL 2023 Runs: యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్.. ఆరెంజ్ క్యాప్‌ రేసులోకి యంగ్ ప్లేయర్

ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం:
తులారాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శని, శుక్రుడిని మిత్రులుగా భావిస్తారు. శని వాయు ఆధిపత్య గ్రహంగా జ్యోతిష్యశాస్త్రంలో భావిస్తారు. కాబట్టి తులారాశి రాశివారికి ఈ క్రమంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక యోగాల్లో తులారాశి వారు పత్యేక పూజలు చేయడం వల్ల విజయం, శ్రేయస్సుతో పాటు డబ్బు పొందుతారు. అంతేకాకుండా శని దేవుడి ఆశీస్సుల లభించి ఉద్యోగాలతో పాటు వ్యాపారాలలో కూడా ఉన్న స్థాయికి చేరుకుంటారు. తులారాశివారికి ఈ క్రమంలో మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది.

మేష రాశి:
శని జయంతికి ముందు..మేషరాశిలో గురు గ్రహంతో పాటు చంద్రుడు కూడా ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఈ క్రమంలో ప్రత్యేకమైన గజకేసరి యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు ఎలాంటి పనులు చేసిన విజయం సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబంతో కూడా ఆనందంగా గడుపుతారు. ఈ ప్రత్యేక యోగాల వల్ల ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

మిథున రాశి:
శని జయంతి రోజే గజకేసరి యోగ ఏర్పడబోతోంది. కాబట్టి దీని ప్రభావం మిథున రాశివారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రత్యేక యోగం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. శనిదేవుని అనుగ్రహంతో దీర్ఘకాలంగా ఉన్నపెండింగ్‌ పనులు పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తుల విషయంలో ఈ రాశులవారు శుభవార్తలు వింటారు. 

Also Read: Yashasvi Jaiswal IPL 2023 Runs: యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్.. ఆరెంజ్ క్యాప్‌ రేసులోకి యంగ్ ప్లేయర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News