Saturn Retrograde 2022: కుంభరాశిలో శని తిరోగమనం...జూన్ 5 నుంచి ఈ 2 రాశుల వారికి సానుకూలం!

Shani Effect On Zodiac Sign:  మరో రెండు రోజుల్లో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. దాని శుభ మరియు అశుభ ప్రభావాలు మొత్తం 12 రాశుల మీద కనిపిస్తాయి. ఏ రాశుల వారికి సానుకూల ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2022, 11:41 AM IST
Saturn Retrograde 2022: కుంభరాశిలో శని తిరోగమనం...జూన్ 5 నుంచి ఈ 2 రాశుల వారికి సానుకూలం!

Shani Vakri On 5th June: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూన్ 5, 2022న శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు శని దేవుడు ఈ రాశిలో తిరోగమనంలో ఉండబోతున్నాడు. ఒక గ్రహం సంచరించినప్పుడల్లా లేదా తిరోగమనం (Saturn Retrograde in Aquarius 2022) చేసినప్పుడల్లా దాని ప్రభావం మొత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. 

శనిదేవుడు 30 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 29 నుంచి తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు.  ఈ సమయంలో శని యొక్క  సాడే సతి లేదా ధైయా కొనసాగుతున్న రాశులవారు.. శని యెుక్క  క్రూరమైన దృష్టిని ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో జాతకంలో శని బలహీనమైన స్థితిలో ఉన్న రాశిచక్ర గుర్తులు వారు కూడా అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జూన్ 5 న, శని గ్రహం తన సొంత రాశిచక్రం కుంభరాశిలో తిరోగమనం చేయబోతోంది. ఇది ఈ 2 రాశుల మీద సానుకూల ప్రభావం చూపించనుంది. దీంతో వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరియనుంది. ఆ రెండు రాశులేంటో చూద్దాం.  

వృషభం (Taurus) - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. తన తెలివి మరియు మంచి ప్రవర్తనతో ఈ రాశివారు అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ కాలంలో ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. 

కన్య (Virgo) - కన్యా రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. వీరు కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 

Also Read: Budh Margi 2022: వృషభరాశిలో బుధుడి సంచారం.. నెల రోజులపాటు 12 రాశులపై తీవ్ర ప్రభావం! 

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే..
శని తిరోగమన సమయంలో శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు అతని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి ఈ చర్యలు చేయడం ద్వారా ఈ కాలంలో అనేక రెట్లు ప్రయోజనాలు లభిస్తాయి.
**ఈ సమయంలో శని దేవుడికి ఆవాల నూనె సమర్పించి దీపం వెలిగించండి.
**శని చాలీసా మరియు శని మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం చాలా ప్రయోజనకరం.
**కుష్టు రోగులకు సేవ చేయండి. అంతే కాదు పేదలకు, నిరుపేదలకు దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
**ఎలాంటి అహంభావం వద్దు. ఎవరినీ అవమానించవద్దు. కార్మికులను అవమానించడం మానుకోండి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News