Sasha Mahapurusha Rajayogam 2024: శష మహా పురుష రాజయోగంతో ఈ 6 రాశులకు అష్ట ఐశ్వర్యాలు, 2025 వరకూ మహర్దశే

Sasha Mahapurusha Rajayogam 2024 in Telugu: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, రాశులకు అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఉంది. గ్రహాల గోచారం వివిధ రాశుల జీవితాలపై గణనీయమైన ప్రభావం పడుతుందనేది నమ్మకం. అదే విధంగా ఈ నెలాఖరున ఏర్పడనున్న శష మహా పురుష రాజయోగం ఈ ఆరు రాశులవారికి అష్ట ఐశర్యాలను అందించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2024, 05:11 PM IST
Sasha Mahapurusha Rajayogam 2024: శష మహా పురుష రాజయోగంతో ఈ 6 రాశులకు అష్ట ఐశ్వర్యాలు, 2025 వరకూ మహర్దశే

Sasha Mahapurusha Rajayogam 2024 in Telugu: నవ గ్రహాల్లో శని గ్రహాన్ని న్యాయ దేవతగా అభివర్ణిస్తారు. అంతేకాకుండా అత్యంత క్రూరమైందిగా పరిగణిస్తారు. అదే శని గ్రహం అనుగ్రహం ఉంటే మాత్రం ఆయా రాశులకు తిరుగుండదంటారు. ఊహించని లాభాలు కలుగుతాయని నమ్మకం. అలాంటి శని గ్రహం కలయికతో ఏర్పడనున్న శష మహా పురుష రాజయోగంతో ఈ ఆరు రాశులకు మహర్దశ పట్టనుంది. ఏయే రాశులకు ఎప్పటి నుంచి దశ తిరగనుంది, ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో పరిశీలిద్దాం

జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం ప్రస్తుతం త్రికోణ రాశి కుంభంలో కొలువుదీరి ఉంది. శని ఏ రాశిలోనైనా కనీసం రెండేళ్లు పైబడి ఉంటుంది. 2025 వరకూ శని ఇదే రాశిలో కొనసాగనుండటం వల్ల ఇతర గ్రహాల కలయిక కారణంగా పంచ మహాపురుష రాజయోగాల్లో ఒకటైన శష మహా పురుష రాజయోగం ఏర్పడనుంది. దాంతో ఈ ఆరు రాశులకు రానున్న 8 నెలలు ఇక వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. హైందవ మతం ప్రకారం శష మహాపురుష రాజయోగం అత్యంత శక్తివంతమైంది. ఈ రాజయోగం ప్రభావం ఏ రాశులపై ఉంటుందో ఆ రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. సెప్టెంబర్ చివరి వారం నుంచి 2025 మే వరకూ ఈ ఆరు రాశుల జీవితాల్లో ఇక అంతా ధనవర్షం కురవనుంది. 

మకర రాశి జాతకులకు శష మహా పురుష రాజయోగం ప్రభావంతో వచ్చే ఏడాది వరకూ ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. విదేశీయానానికి అనువైన సమయం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇక కుంభ రాశి జాతకులకు అంతా మహర్దశే. 2025 ఏప్రిల్- మే నెలల వరకూ పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, వేతన పెంపు ఉంటాయి. వ్యాపారులకు అమితమైన లాభాలు కలుగుతాయి. ఎప్పట్నించో పెండింగులో ఉన్న న్యాయ సమస్యలు పరిష్కారమౌతాయి. 

ధనస్సు రాశి జాతకులకు శష మహా పురుష రాజయోగం కారణంగా అమితమైన ధనలాభం కలుగుతుంది. కెరీర్ లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులైతే కొత్త వ్యాపారాలు ప్రారంబించవచ్చు. పెట్టుబడులకు అనువైన సమయం. విద్యార్ధులకు మంచి జరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. వృషభ రాశి జాతకులు చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావనుకున్న లేదా నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. ధనలాభం కలగడంతో ఆర్ధికంగా ఇబ్బందులు తీరుతాయి. కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. 

తులా రాశి జాతకులకు ఈ సమయం అంటే 2025 మే వరకూ చాలా మంచిది. శారీరకంగా, మానసికంగా చాలా బాగుంటుంది. ఏ విధమైన ఇబ్బందులు వెంటాడవు. విద్యార్ధులకు మంచి సమయం. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఇక సింహ రాశి జాతకులకు శష మహా పురుష రాజయోగంతో గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయి. ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also read: Venus Transit 2024: శుక్రుడి గోచారంతో అక్టోబర్ 13 వరకూ అందరికీ దశ తిరిగిపోనుందా, ఊహించని ధనలాభం ఎవరెవరికంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News