Planet Conjunction: 30 ఏళ్ల తర్వాత శని-శుక్రుల కలయిక... 2024లో ఈ 4 రాశులపై డబ్బు వర్షమే ఇక..

Grah Gochar 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మారుస్తాయి. శుక్రుడు కూడా తన రాశిని మార్చి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఆ రాశిలో శని-శుక్రుల సంయోగం జరగనుంది. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2023, 05:22 PM IST
Planet Conjunction: 30 ఏళ్ల తర్వాత శని-శుక్రుల కలయిక... 2024లో ఈ 4 రాశులపై డబ్బు వర్షమే ఇక..

Saturn-venus Conjunction in Aquarius 2024: గ్రహాలు కాలానుగుమంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులను పెట్టుకుంటాయి. ఈ గ్రహాల సంయోగం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతోంది. 30 ఏళ్ల తర్వాత ఈ శని, శుక్ర గ్రహాల అరుదైన కలయిక జరగబోతోంది. 2024లో శుక్రుడు కుంభ రాశిలో సంచరించబోతున్నాడు. 2025 వరకు అదే రాశిలో శని ఉండబోతున్నాడు. పైగా వీరద్దరూ స్నేహితులు. కుంభరాశిలో శని, శుక్రుడు మైత్రి వల్ల న్యూ ఇయర్ లో కొన్ని రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మిధునరాశి
మిథునరాశి వారికి శుక్రుడు-శని మైత్రి చాలా మేలు చేస్తుంది. 2024లో వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక ఫలిస్తుంది. లక్ కలిసి వస్తుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీరు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. 
మేషరాశి
కుంభరాశిలో శుక్రుడు-శని కలయిక  మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి రాబోయే సంవత్సరం చాలా ఆనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. కెరీర్ లో ముందుకు సాగుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. సంతానప్రాప్తి కలుగుతుంది.  మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: Venus Transit 2023: ఈ రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో లగ్జరీ జీవితాలు ప్రారంభం..

వృషభం
శని-శుక్రుడు సంయోగం వల్ల కొత్త సంవత్సరంలో వృషభరాశి వారు చాలా బెనిఫిట్స్ పొందబోతున్నారు. వీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. జాబ్ చేసేవారికి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
సింహరాశి 
శని-శుక్ర సంచారం సింహరాశి వారికి బోలెడ్ బెనిఫిట్స్ అందించనుంది. కొత్త ఏడాదిలో వీరి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి అవుతుంది. దంపతులకు పిల్లలు పుడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి. 

Also read: Lucky Zodiacs 2023: న్యూ ఇయర్ కు ముందే ధనవంతులు కాబోతున్న రాశుల వారు వీరే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News