Grah Rashi Parivartan 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల సంచారం లేదా తిరోగమన ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుద్ధి మరియు కమ్యూనికేషన్ కు కారకుడు బుధుడు. డిసెంబరులో బుధుడు తిరోగమన స్థితిలో (Retrograde Mercury transit 2022) ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
బుధ సంచారం ఈ రాశులకు శుభప్రదం
మీనం (Pisces): ఈ రాశి యొక్క జాతకంలో తిరోగమన బుధుడు పదవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీరు మీ లైఫ్ లో అనేక ప్రయోజనాలను పొందనున్నారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు ఎన్నో మంచి అవకాశాలు లభించనున్నాయి. ఆర్థికంగా ఈ సమయం మీకు బాగుంటుంది. మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది.
కుంభం (Aquarius): తిరోగమన బుధుడు కుంభరాశి వ్యక్తుల జాతకంలో 11వ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. అధికారుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.
ధనుస్సు (Sagittarius): ఈ రాశి యెుక్క జాతకంలోని లగ్న గృహంలో బుధ సంచారం జరుగుతుంది. కెరీర్‌కు సంబంధించి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారు మంచి లాభాలను పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపవచ్చు.
బుధ సంచారం ఈ రాశులకు నష్టం
మకరం (Capricorn): తిరోగమన బుధుడు ఈ రాశి యెుక్క 12వ ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో మీ వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారంలో లాభం తక్కువగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోనే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio): బుధుడి సంచారం కారణంగా మీ సమయం అననుకూలంగా ఉంటుంది. పని పూర్తి చేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో అడ్డంకులు ఎదురవుతాయి. మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు.
Also read: 120 రోజులుపాటు శుక్రుని రాశిలో కుజుడు... ఈ 3 రాశులవారు కెరీర్‌లో ముందుకెళ్లడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook