Horoscope New Year 2024: కొత్త సంవత్సరం రావడానికి ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాబోయే 2024 సంవత్సరంలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణం గా కొన్ని జాతకాలకు సంబంధించిన స్త్రీలకు సంతోషంతోపాటు అదృష్టం కూడా పెరుగుతుంది. దీంతోపాటు ఎలాంటి శుభకార్యాలు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి అడ్డంకులు తొలగిపోతాయి ప్రేమ జీవితంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. జీవితంలో అపారమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే రాబోయే 2024 సంవత్సరంలో ఏయే రాశుల వారి స్త్రీలకు గ్రహ సంచారాలు అదృష్టాన్ని తెచ్చి పెడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
రాబోయే 2024 సంవత్సరం మేష రాశి స్త్రీలకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లు అన్ని తొలగిపోతాయి. అదృష్టం కూడా రెట్టింపవడం కారణంగా జీవితంలో వచ్చే అన్ని అందం దూరమవుతాయి. ఇక ఆరోగ్య విషయానికొస్తే ఇంతకుముందున్న చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఊహించని లాభాలు పొందుతారు.
సింహరాశి:
సింహరాశి స్త్రీలకు కూడా రాబోయే 2024 సంవత్సరం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కెరీర్లో విజయాలు సాధించడమే కాకుండా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో సులభంగా తీరిపోతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవడం కారణంగా వ్యక్తిగత వృత్తి జీవితంలో అనుకూల వాతావరణ ని పొందుతారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లభించే అన్ని పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఇంతకుముందు ఎదుర్కొన్న మానసిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
తులారాశి:
2024 సంవత్సరం తులా రాశి వారికి జీవితాంతం గుర్తుండబోతోంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించడమే కాకుండా కలలన్నీ నిజమవుతాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. జీవితంలో ఇంతకుముందు సాధించని విజయాలు ఎన్నో సాధిస్తారు. వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సంబంధాలు కూడా మెరుగుపడతాయి.
మీన రాశి:
మీన రాశి స్త్రీలకు 2024 సంవత్సరం అదృష్టాన్ని కలిగించబోతోంది. ఈ సమయంలో మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. దీనికి కారణంగా వృత్తి జీవితంలో పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా లభించి ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం వల్ల సులభంగా వాటిని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు కోరుకున్న కోరికలన్నీ ఈ సంవత్సరంలో నెరవేరుతాయి. అంతేకాకుండా కెరీర్లో ఆశించిన విజయాలను పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి