Pitru Amavasya: హిందూ సంప్రదాయంలో సర్వ పితృ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్ 14న తేది వచ్చింది. అయితే ఈ అమావాస్య శనివారం రావడంతో శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సర్వ పితృ అమావాస్య రోజునే పితృ పక్షం ముగుస్తుంది. పురాణాల ప్రకారం..వారి పూర్వీకులు మరణించిన సమయం గుర్తులేకపోతే ఈ రోజు వారిని తలుచుని శ్రాద్ధ కర్మ చేయోచ్చు. ఈ సర్వ పితృ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల, పితృ దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో ఎలాంటి అడ్డంకులు రావని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపున్నారు. అయితే సర్వ పితృ అమావాస్య ప్రత్యేక పరిహారలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సర్వ పితృ అమావాస్య ప్రత్యేక సమయం:
పితృ పక్షం సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమవుతుంది. అమావాస్య తిథి 13 అక్టోబర్ 2023 రాత్రి 9.50 గంటలకే మొదలవుతుంది. ఈ అమావాస్య 14 అక్టోబర్ 2023 రాత్రి 11.24 వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పితృ దోషాలు ఉన్నవారు ఉదయ తిథి ప్రకారం, సర్వ పితృ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
సర్వ పితృ అమావాస్య పరిహారం:
సర్వ పితృ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మ చేసేవారు తప్పకుండా పలు పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా రాత్రి పూట ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి.
సూర్యోదయం నుంచి ఈ దీపం సూర్యాస్తమయం వరకు వెలుగుతూనే ఉండేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ దీపం వెలిగించే క్రమంలో నూనెలో తప్పకుండా కుంకుమపువ్వు, 2 లవంగాలు కలిపాల్సి ఉంటుంది.
ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.
ఈ సమయంలో తప్పకుండా జంతువులకు హానికలిగించకూడదు.
ఈ అమావాస్య రోజున గోవుకు సేవలు అందించడం చాలా మంచిది. ఇలా చేస్తే లక్ష్మిదేవికి అనుగ్రహం లభిస్తుంది.
అమావాస్య సాయంత్రం పూట తప్పకుండా ఉసిరి చెట్టుకు పూజలందించాల్సి ఉంటుంది.
ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులను బలోపేతం అవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..