Naraka Chaturdashi 2022: నరక చతుర్దశి రోజున చేయకూడని పనులివే.. ఇలా చేస్తే నరకానికే.. ఎందుకో తెలుసా..?

Naraka Chaturdashi 2022: నరక చతుర్దశి రోజున కింద పేర్కొన్న పనులను అస్సలు చేయకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఒక వెళా చేస్తే నరకానికి వెళ్తారని చెబుతున్నారు. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2022, 11:55 AM IST
  • నరక చతుర్దశి రోజున చేయకూడని పనులివే..
  • ఇలా చేస్తే నరకానికే..
  • ఎందుకో తెలుసా..?
Naraka Chaturdashi 2022: నరక చతుర్దశి రోజున చేయకూడని పనులివే.. ఇలా చేస్తే నరకానికే.. ఎందుకో తెలుసా..?

Naraka Chaturdashi 2022: నరక చతుర్దశి ప్రతి సంవత్సరం కార్తీక కృష్ణ పక్షం చతుర్దశినాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి పండగ, నరక చతుర్దశి పండుగ ఒకే రోజు వచ్చాయి. కాబట్టి నరక చతుర్దశిని అక్టోబర్ 23 (ఈరోజు) కూడా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజున దక్షిణం దిక్కున పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించి యమధర్మరాజును పూజించాలని పురాణాలనుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే చాలామంది ఈ పూజలో భాగంగా తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించడం లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చేయకూడని పనులు కూడా ఈరోజు చేస్తున్నారు. వీటి వల్ల కూడా భవిష్యత్తులో పలు రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేయకూడని పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ముహూర్తాలు, సమయాలు:
అభ్యంగ స్నాన ముహూర్తం: ఉదయం 05:06 నుంచి 06:27
నరక చతుర్దశి నాడు చంద్రోదయ సమయం: ఉదయం 05:06

ఈ పనులు చేయకూడదు:
>>నరక చతుర్దశి రోజున ఆలస్యంగా నిద్రపోకూడదు. తొందరనే పడుకొని ఉదయం పూట అంటే దీపావళి రోజున ఐదు గంటలకే లేవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
>> ఈ రోజు ఇంటి తలుపులు అస్సలు తెరవకూడదు. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారాలను మూసి ఉంచాలి.
>> పొరపాటున కూడా మాంసాహారం తీసుకోకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పక్షులకు, జంతువులకు ఎటువంటి ప్రాణులకు హాని కలిగించకూడదు.
>> ఈ రోజు చీపురును ఇంటి నుంచి బయటకు తీయకూడదు.
>> నరక చతుర్దశి రోజున ఇంట్లో గొడవలకు పాల్పడితే పేదరికం మొదలవుతుందలయ్యే ఛాన్స్‌ ఉంది.
>> ఇంట్లో దక్షిణ దిశలో దుమ్ము, ధూళిని తొలగించాలి.
>>నరక చతుర్దశి రోజున కూడా నూనె దానం చేయకూడదు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS దీనిని ధృవీకరించలేదు.)

Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?

Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News