Mercury Transit 2023: వైదికశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా భావిస్తారు. అంతేకాకుండా ధనం, వ్యాపారం, బుద్ధికి కారకుడిగా బుధుడిని పరిగణిస్తారు. అందుకే బుధుడి గోచారం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశులకు అత్యంత శుభప్రదంగా ఉండనుంది.
బుధ గ్రహం సుదీర్ఘ కాలం తరువాత తన సొంత రాశి కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం కొన్ని రాశులకు మహర్దశ కల్గించనుంది. బుధుడి గోచారంతో వివిధ జాతకుల ఆర్ధిక పరిస్థితి, కెరీర్‌పై ప్రభావం పడనుంది. బుధుడు అక్టోబర్ 1న అంటే మరో నాలుగు రోజుల్లో కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 1 రాత్రి 8 గంటల 39 నిమిషాలకు సింహ రాశి నుంచి బయటికొచ్చి కన్యా రాశిలో గోచారం చేయనున్నాడు. అక్టోబర్ 23 వరకూ కన్యా రాశిలోనే పయనించనున్నాడు. అంతేకాకుండా అక్టోబర్ 7వ తేదీన స్వాతి నక్షత్రంలో ప్రవేశం, అక్టోబర్ 31న స్వాతి నక్షత్రం నుంచి విశాఖ నక్షత్రంలోని ప్రవేశించడం ఉంటుంది. బుధుడి కదలికలో జరిగే ఈ కీలక పరిణామాలు 3 రాశులకు శుభ పరిణామాల్ని కల్గించనుంది.
కన్యా రాశిలో బుధుడి ప్రవేశం ఫలితంగా ఈ రాశివారికి గోల్జెన్ డేస్ ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే అంతులేని ధన సంపదలు వచ్చి పడనున్నాయి. వ్యాపారులకు అమితమైన లాభాలు కలుగుతాయి. కీలకమైన పనులు విజయవంతమౌతాయి. బుధుడి కటాక్షంతో కనకవర్షం కురవనుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి.
వృషభ రాశి జాతకులకు బుధుడి గోచారం విశేషమైన లాభాలకు కారణమౌతుంది. ఆస్థి సంబంధిత విషయాల్లో మీకు విజయం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. డబ్బులు వచ్చి పడతాయి. పాత సమస్యలుంటే తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లాభిస్తాయి.
బుధ గ్రహం కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల మిధున రాశికి సైతం అమితమైన లాభం చేకూరనుంది. ఎందుకంటే బుధుడు ఈ రాశికి కూడా అధిపతి.. పనిచేసేచోట గౌరవ మర్యాదలు ఉంటాయి. పెండింగులో లేదా ఎక్కడైనా చిక్కుకున్న డబ్బులు చేతికి అందుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆర్దిక పరిస్ఠితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook