Mercury Transit In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని ప్రత్యేక గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనిని కమ్యూనికేషన్, గణితం, వ్యక్తుల తెలివితేటలు, స్నేహానికి సూచిగా భావిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు యువ రాజుగా కూడా పిలుస్తారు. అయితే ఈ గ్రహం ఎవరి జాతంలోనైతే శుభ స్థానంలో ఉంటుందో..వారికి అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్న గ్రహం రాశి సంచారానికి సిద్ధమైంది. మార్చి 15న బుధుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ గ్రహం మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బుధుడు మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
బుధుడు మీనరాశిలో ప్రవేశం చేయడం వల్ల మేష రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అదృష్టంతో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి సమాజంలో స్థాయి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో వీరు ప్రజలను కూడా ఆకట్టుకుంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి బుధుడు సంచారం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఈ సమయంలో మనస్సు కూడా ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా మంచి ఆలోచనలు పొందుతారు. వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత విస్తరణ అవుతుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు.
సింహ రాశి:
మీనరాశిలో ఈ సంచారం జరగడం వల్ల సింహ రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీరు శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. దీని కారణంగా వీరికి ప్రమోషన్స్‌తో పాటు గౌరవం లభించే ఛాన్స్ కూడా ఉంది. అలాగే సమాజంలో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి