Mercury Transit 2023: సెప్టెంబర్ 16 నుంచి ఈ 3 రాశుల వారు లగ్జరీ వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు!

Mercury Transit 2023: బుధుడి తిరోగమనం కారణంగా సెప్టెంబర్ 16 నుంచి 12 రాశుల వారి జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ తిరోగమన కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2023, 09:40 PM IST
Mercury Transit 2023: సెప్టెంబర్ 16 నుంచి ఈ 3 రాశుల వారు లగ్జరీ వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు!

Mercury Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని చిన్న గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం నేల లేదా రెండు నెలలకు ఒకసారి రాశి సంచారం చేస్తుంది. ఈ రాశి సంచారం కారణంగా బుధుడు జాతకంలో ప్రత్యేక స్థానంలో ఉంటే వ్యక్తుల జీవితంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అదే గ్రహం వ్యక్తుల జాతకాల్లో ప్రతికూల స్థానాల్లో ఉంటే జీవితంలో ఎన్నో రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే సెప్టెంబర్ 16వ తేదీన బుధ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి హిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

ముఖ్యంగా బుధ గ్రహం తిరోగమనం చేయడం వల్ల సింహ రాశి వారికి పెండింగ్ లో ఉన్న పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడేవారు ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. ఈ తిరోగమనం కారణంగా సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో కొత్త మార్గాలు లభిస్తాయి. దీనికి కారణంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్

బుధుడి తిరోగమనం కారణంగా మిధున రాశి వారి జీవితంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ సమయంలో కొత్త ఆలోచనలతో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి జీవితంలో ఎప్పుడూ పొందలేనంత డబ్బును కూడా పొందుతారు అంతేకాకుండా వీరు లగ్జరీ వస్తువులతో పాటు కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారి విషయానికొస్తే ఈ సమయం బ్రహ్మాండంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక ఈ తిరుగు గమనం కారణంగా ధనస్సు రాశి వారు కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని.. ఈ సమయంలో వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో సులభంగా నెరవేరుతాయి దీంతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి భవిష్యత్తులో మంచి లాభాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి : Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News