Mars Transit 2022: అక్టోబరులో కుజుడు రాశి మార్పు.. ఈ 2 రాశులవారికి వ్యాపారంలో లాభం, కెరీర్‌లో పురోగతి..

Mars Transit 2022: అక్టోబర్ 16న కుజుడు రాశిని మార్చబోతున్నాడు. వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది రెండు రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2022, 04:17 PM IST
Mars Transit 2022: అక్టోబరులో కుజుడు రాశి మార్పు.. ఈ 2 రాశులవారికి వ్యాపారంలో లాభం, కెరీర్‌లో పురోగతి..

Mars Transit 2022 Effects: గ్రహాల కమాండర్ మార్స్ తన రాశిని మార్చబోతున్నాడు. అక్టోబరు 16వ తేదీ ఉదయం 6.36 గంటలకు కుజుడు వృషభ రాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి (Mars Transit in Gemini 2022) ప్రవేశిస్తాడు. అక్కడే 15 రోజులపాటు సంచరిస్తాడు. అనంతరం అక్టోబరు 30న అదే రాశిలో తిరోగమనం చెందడం ప్రారంభిస్తాడు. నవంబరు 13 వరకు ఇదే స్థితిలో ఉంటాడు. తర్వాత అతడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. మేషం, వృశ్చిక రాశులకు అంగారకుడు అధిపతి. కుజుడు యెుక్క రాశి మార్పు ఖచ్చితంగా ఈరెండు రాశులపై ఉంటుంది. ఈ రెండు రాశులవారిపై అంగారక సంచారం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. 

మేషరాశిపై ప్రభావం..
మిథునరాశిలో కుజుడు ఉండటం వల్ల మేషరాశివారికి ధైర్యసాహసాలు పెరుగుతాయి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. పిల్లలను ఎప్పుడు ఇంట్లోనే ఉంచకుండా ఆరు బయట ఆటలు ఆడేలా తల్లిదండ్రులు ప్రేరేపించాలి. అలా వారిని శారీరంగా దృఢంగా చేయాలి. ఈ రాశివారు ప్రయాణాలు చేయడం ద్వారా మంచి లాభాలు గడిస్తారు. 

వృశ్చికరాశిపై ప్రభావం..
వృశ్చిక రాశివారు లోపాలను పరిష్కరించుకోవాల్సిన సమయం ఇది. మీరు ఈ సమయంలో జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీకు మందు, సిగరెట్ వంటి వ్యసనాలు ఉంటే వదిలించుకోవడం మంచిది. మిథునరాశిలో కుజుడు సంచారం ఈ రాశి విద్యార్థులకు, పరిశోధనలు చేసేవారికి కలిసి వస్తుంది. సమయం వృథా చేసే విషయాలకు మీరు దూరంగా ఉండాలి. ఏకాగ్రతను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. 

Also Read: Navratri 2022 Vastu Upay: ఈ నగరాలకు అమ్మవారి పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News