Mangal Margi 2023: కొత్త ఏడాదిలో మార్గంలోకి రానున్న కుజుడు.. ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Mangal Margi 2023: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కుజుడు వృషభరాశిలో మార్పు చెందబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 12:54 PM IST
  • ఆస్ట్రాలజీలో కుజుడిని రెడ్ ప్లానెట్ అంటారు
  • ప్రత్యక్ష సంచారంలోకి కుజుడు
  • ఈ మూడు రాశులకు అపారమైన ప్రయోజనం
Mangal Margi 2023: కొత్త ఏడాదిలో మార్గంలోకి రానున్న కుజుడు.. ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Mangal Margi In Tula Zodiac: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని ధైర్యసాహసాలను ఇచ్చే దేవుడిగా పరిగణిస్తారు. కుజుడిని గ్రహాల కమాండర్, రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 13, 2023న మార్స్ గ్రహం మార్గంలోకి (Mangal Margi In libra 2023) రానున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. కుజుడు మార్గి కారణంగా మూడు రాశులవారి భారీగా ప్రయోజనాలను పొందనున్నారు. అంతేకాకుండా మీరు వృత్తి మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కుజ సంచారం ఈ రాశులకు శుభప్రదం
కర్కాటకం (Cancer): మార్గిలో కుజుడు ఉండటం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో అంగారకుడు పరివర్తన చెందబోతున్నాడు. దీంతో కర్కాటక రాశివారి ఆదాయం పెరగనుంది. మీరు కొత్త మార్గాల ద్వారా డబ్బును సంపాదించనున్నారు. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈసమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

కన్య (Virgo): అంగారకుడు సంచారం వల్ల కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశించనుంది. మీరు వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తలు వింటారు.  

సింహం (Leo): అంగారకుడి సంచారం వల్ల మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి పదవ ఇంట్లో కుజుడు సంచరింబబోతున్నాడు. దీనిని పని మరియు ఉద్యోగ ప్రదేశంగా భావిస్తారు. మీరు కొత్త జాబ్ ఆఫర్ ను పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో మీరు కొత్త ఆర్డర్‌లు స్వీకరించే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 

Also Read: Rahu Transit: 2023 అక్టోబరు వరకు మేషరాశిలో రాహువు... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News