Mangal Gochar 2022: అక్టోబరులో మిథునరాశిలోకి కుజుడు... ఈ 5 రాశులవారి కెరీర్ అదుర్స్..!

Mangal Gochar 2022:  వచ్చే నెలలో కుజుడు మిథునరాశిలో సంచరించబోతున్నాడు. అంగారకుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2022, 10:45 AM IST
Mangal Gochar 2022: అక్టోబరులో మిథునరాశిలోకి కుజుడు... ఈ 5 రాశులవారి కెరీర్ అదుర్స్..!

Mangal Gochar October 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిచక్రాన్ని మారుస్తుంది. ఇది 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. అక్టోబరు 16న కుజుడు మిథునరాశిలో (Mars transit in Gemini 2022) సంచరించబోతున్నాడు. అయితే అదే నెల 30వ తేదీన ఉదయం 6.19 నిమిషాలకు కుజుడు అదే రాశిలో తిరోగమనం చేయనున్నాడు. అతడు నవంబరు 13 వరకు అదే స్థితిలో ఉంటాడు. అయితే మిథునరాశిలో కుజ సంచారం కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం(Aries): అంగారక సంచారం  మిథునరాశివారికి మేలు చేస్తుంది. కుజుడు ఈ రాశి యెుక్క  మూడో ఇంట్లో సంచరించనున్నాడు. ఇది  ఈ రాశివారి జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు జీతం పెరుగుతుంది. 

వృషభం(Taurus): వృషభ రాశి వారికి అంగారక సంచారం భారీ లాభాలను ఇస్తుంది. ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. దీంతో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందుతారు. అనవరసమైన ఖర్చులను నియంత్రించుకుంటే మీకు మంచిది. వ్యాపారులకు లాభాలు మెండుగా ఉంటాయి. 

సింహం(Leo): కుజుడు  ఈ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశివారు భారీ మెుత్తం లాభాలను ఆర్జించనున్నారు.  ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఈ సమయంలో దేనిపైనైనా పెట్టుబడి పెడితే అది లాభదాయకంగా ఉంటుంది. 

కన్య(Virgo): కుజ సంచారం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క పదో ఇంట్లో అంగారుకుడు సంచరించనున్నాడు. దీంతో వీరికి ఆర్థికంగా పురోగమిస్తారు.  బిజినెస్ విస్తరిస్తుంది. జాబ్ వచ్చే అవకాశం ఉంది. 

కుంభం (Aquarius): కుంభ రాశి వారికి అంగారకుడు తృతీయ, దశమి గృహాలకు అధిపతి. దీని సంచారం ఈ రాశి యెుక్క ఐదో స్థానంలో జరుగుతుంది. దీంతో వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు ఏ పని తలపెట్టినా పూర్తి చేస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.  

Also Read: Budh Margi: అక్టోబర్ 2 నుండి బుధుడి ప్రత్యక్ష సంచారం.. ఈ 3 రాశులవారికి లక్కే లక్కు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News