Mahalaya Amavasya 2022: సెప్టెంబరు 25న అరుదైన యోగం.. ఈరాశులవారికి లక్కే లక్కు..!

Mahalaya Amavasya 2022: ఈసారి మహాలయ అమావాస్య సెప్టెంబరు 25న వస్తుంది. ఈ రోజున ఒకేరాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల శుభ యోగం ఏర్పడుతోంది. ఇది 5 రాశులవారి అదృష్టాన్ని తెరవబోతుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2022, 10:53 AM IST
Mahalaya Amavasya 2022: సెప్టెంబరు 25న అరుదైన యోగం.. ఈరాశులవారికి లక్కే లక్కు..!

Mahalaya Amavasya 2022: మహాలయ అమావాస్య అక్టోబర్ 25న అంటే ఆదివారం వస్తుంది. ఈ రోజున చంద్రుడు సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కన్యారాశిలో 4 గ్రహాల కలయిక ఏర్పడనుంది. ఈ కాంబినేషన్‌లో బుధాదిత్య, లక్ష్మీనారాయణ యోగాలతోపాటు అరుదైన శుభ యోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం (Auspicious Yoga) 5 రాశులవారికి సంతోషకరమైన ఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మేష రాశి (Areis): మేష రాశి వారు మహాలయ అమావాస్య నాడు ఎంతో ప్రయోజనం పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు ట్రాన్స్ ఫర్, ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. 

వృషభం (Taurus): ఈ యోగం వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లికాని ప్రసాదులకు వివాహమయ్యే అవకాశం ఉంది. 

సింహం (Leo): సింహ రాశి వారికి కూడా ఈ యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టుతో మీ సమస్యలను అధిగమిస్తారు. పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు ఉంటాయి. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. 

ధనుస్సు (Sagittarius):  ఈ రాశి నుండి పదో ఇంట్లో నాలుగు శుభ గ్రహాల కలయిక మరియు లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడటం ఈ రాశికి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మీనరాశి (Aries): మహాలయ అమావాస్య నాడు 4 గ్రహాల వల్ల ఏర్పడే శుభ యోగం మీన రాశి వారికి కూడా బాగానే ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ​​ఉంటుంది. మీడియా మరియు రాజకీయాలలో పనిచేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

Also Read: Venus Transit 2022: కన్యారాశిలోకి శుక్రుడు.. మరో 2 రోజుల్లో ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News