Maha Shivratri 2021: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

These 7 Things Are Not Offered To Lord Shiva | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. వారికి తోచినవి పరమశివుడికి సమర్పించడం జరుగుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2021, 09:11 PM IST
  • ద గ్రేట్ నైట్ ఆఫ్ శివ అని కూడా మహాశివరాత్రి పండుగను పిలుస్తారు
  • మహాదేవుడు శివుడు, పార్వతిల వివాహ మహోత్సవమే మహాశివరాత్రి
  • భక్తులు తోచినవి పరమశివుడికి సమర్పించడం జరుగుతుంది
Maha Shivratri 2021: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

Maha Shivratri 2021: నేడు మహా శివరాత్రి పర్వదినం. ద గ్రేట్ నైట్ ఆఫ్ శివ అని కూడా మహాశివరాత్రి పండుగను పిలుస్తారు. మహాదేవుడు శివుడు, పార్వతిల వివాహ మహోత్సవం సందర్భంగా నేడు మహా శివరాత్రి పండుగను భక్తులు వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. వారికి తోచినవి పరమశివుడికి సమర్పించడం జరుగుతుంది. 

ఫాల్గుణ మాసంలో 13వ తేదీ రాత్రి మరియు 14వ తేదీన మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ ఏడాది మార్చి 11న శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగను భక్తులు జరుపుకుంటున్నారు. పుణ్యాది స్నాన కార్యక్రమాలు ఆచరించి, కోరిన కోరికలు నెరవేర్చాలని పరమశివుడిని ప్రార్థిస్తూ పూజాది కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అయితే 7 రకాల వస్తువులు, పదార్థాలను శివుడికి సమర్పించకూడదని పురాణాలు చెబుతున్నాయి. పెద్దలు సైతం Maha Shivratri 2021 రోజున ఈ విషయాలు కొన్ని పాటిస్తుంటారు.

Also Read: Maha Shivratri 2021 Puja Mantra In Telugu: మహా శివరాత్రి రోజున ఏ మంత్రం జపించాలి, శివ పంచాక్షరీ మంత్రం విశిష్టత ఇదే

తులసి(Tulasi)
పురాణాల ప్రకారం ఎంతో పరమ పవిత్రమైన తులసి యొక్క మొదటి భర్త అయిన శంఖచూడుడు ఓ రాక్షసుడు. అతడు శివుడ్ని, పార్వతిని ఇష్టపడలేదు. వారిపై ద్వేషం పెంచుకుని ఏకంగా శివుడిపైనే యుద్ధం చేస్తాడు. అయితే పరమశివుడు శంఖచూడుడును అంతం చేస్తారు. కనుక మీరు ఎప్పుడూ తులసి ఆకులు శివుడికి సమర్పించకూడదు.

కుంకుమ(Kumkum)
శివుడికి కుంకుమ అర్పించబడదు. ఎందుకంటే శివుడిని సన్యాసిగా, ఏకాంతజీవనం గడుపే వ్యక్తిగా పరిగణిస్తారు. అందువల్ల ఆయనకు కుంకుమ సమర్పించకూడదు.

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజు పరమ శివుడికి ఏమేం సమర్పించాలి, వేటితో అభిషేకం చేయాలో తెలుసా

విరిగిన బియ్యం(Broken Rice)
పురాణాల ప్రకారం శివుడికి అక్షత్ లేదా మొత్తం బియ్యం అర్పిస్తారు. బియ్యం విరిగితే అశుద్ధంగా పరిగణిస్తారు. మరియు అందువల్ల శివుడికి అర్పించటానికి విరిగిన బియ్యం గింజలు వాడరాదు..

శంఖం(Conch)
పరమశివుడు శంఖచూడుడు అనే రాక్షసుడిని అంతం చేశాడు. అతడికి చిహ్నమైన శంఖువును శివుడిని ఆరాధించేటప్పుడు ఉపయోగించబడదు.

Also Read: Maha Shivratri 2021 Date And Time: మహా శివరాత్రి తేదీ, పూజకు శుభ ముహూర్తం, తిథి, ప్రాముఖ్యత

Kewda and Champa
కెవ్డా మరియు చంపా అనే పువ్వులు శివుని శాపానికి గురయ్యాయని నమ్ముతారు. అందువల్ల మీరు శివుడికి ఈ పువ్వులతో పూజ చేయకూడదు.

కొబ్బరి నీళ్లు (Coconut Water)
మహాదేవుడు శివుడికి ఇచ్చే ఏదైనా నిర్మలయగా ఉన్నట్లు పరిగణిస్తారు. అలాంటప్పుడు నిర్మలమైన కొబ్బరి నీళ్లు ఇచ్చి సమర్పించకూడదని చెబుతారు.

పసుపు (Haldi)
పసుపు అనేది ఒక అందం పెంచడానికి సహాయపడే ఒక పదార్ధం. మరియు శివుడు ఒక సన్యాసి కనుక ఆయనకు పసుపును అర్పించకూడదని పెద్దలు చెబుతారు.

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News