Lunar Eclipse 2022: ఏడాది చివరి చంద్రగ్రహణం తేదీ, సమయం ఎప్పుడు, ఆ ఐదు రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది

Lunar Eclipse 2022: ఆఖరి సూర్యగ్రహణం ముగిసింది. ఇక ఏడాదిలో ఆఖరి చంద్రగ్రహణం మిగిలింది. ఈ ఏడాది చివరి గ్రహణం కావడంతో..ఐదు రాశులపై ప్రభావం పడనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2022, 07:10 PM IST
Lunar Eclipse 2022: ఏడాది చివరి చంద్రగ్రహణం తేదీ, సమయం ఎప్పుడు, ఆ ఐదు రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికకు ప్రత్యేక ప్రాదాన్యత ఉంది. జ్యోతిష్య పండితుల ప్రకారం ఈ ఏడాది చంద్రగ్రహణం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఐదు రాశులపై చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఆ వివరాలు మీ కోసం..

నవంబర్ 8న ఏర్పడేది ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రానున్న చంద్రగ్రహణం 5 రాశులపై దుష్ప్రభావం పడనుంది. శనిగ్రహం కుంభరాశి పంచమస్థానంలో ఉండటం, మిథునరాసి నవమభాగంలో ఉండటంతో మంగళ యుతి ఏర్పడుతుంది. ఈ పరిణామం జరగనున్న ముప్పుకు సంకేతంగా ఉంటుంది. చంద్రగ్రహణం ఈ సంయోగాన్ని జ్యోతిష్యులు వినాశనకరంగా చెబుతున్నారు. ఈ గ్రహణం సందర్భంగా శని, మంగళ గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురౌతాయి. ఫలితంగా ప్రతికూల ఫలితాలు ఎదురౌతాయి. అందుకే ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి.

ఈ రాశులపై ప్రభావం

జ్యోతిష్య పండితుల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చంద్రగ్రహణం కారణగా వృషభం, మిథున, కన్య, తుల, వృశ్చిక రాశి జాతకులకు వివిధ రూపాల్లో హాని కలగవచ్చు. ఈ రాశివారి ఆరోగ్యం వికటించే అవకాశం ఉంది. లేదా వ్యాపారంలో భారీ నష్టాన్ని చవిచూడవచ్చు. ఆర్ధిక విషయాల్లో ఈ ఐదు రాశుల జాతకులు ఇబ్బంది ఎదుర్కోవచ్చు. అందుకే ఏదైనా పనిని తొందరపాటులో చేయకూడదు. డబ్బుల లావాదేవీలు కూడా ఆచితూచి చేయాల్సి ఉంటుంది.

చంద్రగ్రహణం సమయం

నవంబర్ 8వ తేదీన ఏర్పడనున్న చంద్రగ్రహణం మద్యాహ్నం 5 గంటల 32 నిమిషాల నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ సయమంలో 5 రాశుల జాతకులు జాగ్రత్తగా ఉండాలి.

Also read: Monthly Horoscope: ఈ రాశులవారికి నెల మొత్తం లాభాలే.. కాని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ఈ సందర్భంగా గ్రహణ కాలం ఉదయం 9 గంటల 21 నిమిషాల నుంచి గ్రహణం పూర్తయ్యేవరకూ ఉంటుంది.

Trending News