How to please lord Hanuman: హనుమంతుడిని ఇలా పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడట

How to please lord Hanuman, Hanuman puja vidhanam in Telugu: హనుమంతుడికి మంగళవారం ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. మంగళవారం, శనివారం నాడు ఆ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అయితే, హనుమంతుడిని పూజించే (Hanuman puja) క్రమంలో భక్తులు తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 10:11 AM IST
How to please lord Hanuman: హనుమంతుడిని ఇలా పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడట

How to please lord Hanuman, Hanuman puja vidhanam in Telugu: హనుమంతుడికి మంగళవారం ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. మంగళవారం, శనివారం నాడు ఆ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అయితే, హనుమంతుడిని పూజించే (Hanuman puja) క్రమంలో భక్తులు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే... హనుమంతుడు తనను మాత్రమే పూజించే వారి కంటే.. తాను ఆరాధ్య దైవంగా భావించే ఆ శ్రీరాముడిని కూడా పూజించే వారంటేనే ఆయనకు మహా ప్రీతి అని మహర్షులు చెబుతుంటారు. రామయ్య పట్ల హనుమంతుడికి ఉన్న భక్తి అంత గొప్పది మరి. అందుకే ఆ హనుమంతుడిని రామబంటు అని కూడా పిలుస్తుంటారు. 

Hanuman blessings - హనుమంతుడి అనుగ్రహం: 
హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే.. ఆ భక్తులు శ్రీరాముడి భక్తులు కూడా అయ్యుండాలని పురాణాలు చెబుతున్న మాట. ఎందుకంటే.. ఎక్కడైతే రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడనీ, తన రామయ్య (Lord Sriram) పట్ల భక్తిశ్రద్ధలు కలిగిన వారిని చూసి హనుమంతుడు కూడా మురిసిపోతాడని రామాయణ గ్రంధాలు (Ramayana) చెబుతున్నాయి. అందుకే ఆ శ్రీరాముడితో కలిపి హనుమంతుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు, మొక్కులు తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

Also read : Beautiful Temples: ఇండియాలోని అందమైన ఏడు ఆలయాలివే

Hanuman puja vidhanam - హనుమాన్ పూజా విధానం:
మంగళవారం, శనివారం (Hanuman puja on Tuesday, Saturday) హనుమంతుడికి ప్రదక్షిణలు చేసి సిందూరంతో అభిషేకం, ఆకుపూజ చేస్తే సత్ఫలితాలు కనిపిస్తాయి. హనుమంతుడికి వడలు, తీపి పిండివంటలు నైవేద్యంగా (Prasadam for Hanuman) సమర్పించాలి. వీలైతే హనుమాన్ జయంతి నాడు ఈ విధంగా పూజ (Hanuman Jayanti puja) చేయగలిగితే మరింత మంచిది అని వేదాలు తెలిసిన బ్రాహ్మణులు చెబుతుంటారు. మంగళవారం, శనివారాల్లో సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ నామ సంకీర్తనం చేసిన వారికి హనుమంతుడు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో తులతూగేలా అనుగ్రహిస్తాడని వేదాలు చెబుతున్నాయి.

Also read : Coconut @ 6.5 lakhs: ఆ కొబ్బరికాయ ప్రత్యేకత ఏంటి, ఎందుకు 6.5 లక్షలకు అమ్ముడైంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News