Horoscope Today September 3rd 2022: ఇవాళ శనివారం. శనీశ్వరుడు (శని దేవుడు)కి అంకితం చేయబడిన రోజు. జీవితంలో కష్టనష్టాలతో బాధపడేవారు శనివారం శనీశ్వరుడిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మరి ఈ శనివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి (Aries)
ఇవాళంతా ఉత్సాహంగా ఉంటారు. మీ మాటలు, వ్యక్తిత్వం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి.మీ పార్ట్నర్తో బంధం మరింత బలపడుతుంది. కొన్ని అనుకోని సంఘటనలు లేదా పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రమశిక్షణ పెంచుకోవడం, ఓపికగా వ్యవహరించడం అలవరుచుకుంటే అన్ని పనుల్లో మీకు విజయం చేకూరుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభ రాశి (Taurus)
మీ చుట్టూ పాజిటివిటీ నెలకొంటుంది. మీ ప్రేమ జీవితం పట్ల ఎగ్జయిట్మెంట్ పెరుగుతుంది. మీ ప్రేయసి లేదా ప్రియుడు చెప్పే మాటలను పాటిస్తారు. ఉద్యోగ, వ్యాపారస్తులు రిస్క్‌తో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవారు బాగా రాణిస్తారు. బిజినెస్‌లో మంచి లాభాలు పొందుతారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. పెళ్లయిన జంటలకు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, నమ్మకం పెరుగుతాయి.
మిథున రాశి (GEMINI)
ఇవాళ కొన్ని గుర్తుండిపోయే ఘటనలుచోటు చేసుకుంటాయి. అవి మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతాయి. జీవితంలో సక్సెస్ అయ్యే సంకేతాలు పొందుతారు. మీ వ్యక్తిత్వం ఇవాళ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఫోకస్ చేస్తారు. చేపట్టిన పనిని బాధ్యతగా పూర్తి చేస్తారు. ఫలితాలు మీరు అంచనా వేసినట్లుగానే ఉంటాయి.కెరీర్ పరంగా ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి (Cancer)
ఇవాళ మీ ఫోకస్ అంతా పని పైనే ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తుల పట్ల మరింత నమ్మకం ఏర్పడుతుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అందరితోనూ వినయంగా ఉంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రుచికరమైన భోజనాన్ని ఆరగిస్తారు. బిజినెస్‌లో లోటుపాట్లను బాగా అర్థం చేసుకుంటారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుంటారు.
సింహ రాశి (LEO)
మీ కోరికలను అదుపులో ఉంచుకోండి. క్లోజ్ ఫ్రెండ్స్‌ని దూరం చేసుకోవద్దు. ఏ విషయంపై మాట్లాడినా అర్థవంతంగా ఉండాలి. మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లేందుకు కష్టపడుతారు. బిజినెస్‌లో ప్రాఫిట్స్ కోసం కొత్త వ్యూహాలు అమలుచేస్తారు. నమ్మకంతో పనిచేస్తే సత్ఫలితాలు పొందుతారని గ్రహిస్తారు. ఎమోషనల్ మ్యాటర్స్‌లో ఓపికగా వ్యవహరిస్తారు.
కన్య రాశి (Virgo)
మీ కెరీర్, బిజినెస్ ఆశాజనకంగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవంగా ఉంటారు. కెరీర్ పరంగా మంచి స్థానానికి చేరే అవకాశాలు పొందుతారు. కమర్షియల్ యాక్టివిటీస్ సానుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబంలో సంతోషం, ఉత్సాహం నెలకొంటుంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే ఆలోచనలో ఉంటారు. తోబుట్టువుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.
తులా రాశి (Libra)
ఇవాళంతా పాజిటివ్ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. ఇవాళ మీరు అనుకోని రీతిలో ఒక కానుక పొందే అవకాశం ఉంది. క్రియేటివ్ వర్క్‌లో ప్రతిభ కనబరుస్తారు. పరిస్థితులను అర్థం చేసుకుని డీల్ చేయడంలో మీ శక్తి సామర్థ్యాలు మెరుగవుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు వంద శాతం కష్టపడుతారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఇవాళ చాలా అసంతృప్తితో ఉంటారు. మనసంతా తెలియని అసంతృప్తి వెంటాడుతుంది. బద్దకంగా, నిరాశ నిస్పృహలతో ఉంటారు. మీరు చేపట్టిన పనులపై ఆ ప్రభావం ఉంటుంది. మునుపటికన్నా వేగం తగ్గుతుంది. ప్రేమికులు పెళ్లికి సంబంధించిన నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి డిసప్పాయింట్మెంట్ తప్పకపోవచ్చు.
ధనుస్సు రాశి (Sagittarius)
బిజినెస్ పట్ల చాలా స్పష్టతతో ఉంటారు. అవసరమైన మేరకే బడ్జెట్ కేటాయిస్తారు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలనే విషయం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. రిలేషన్షిప్ మరింత మధురంగా మారుతుంది. ఒకరి పట్ల ఒకరికి మరింత ప్రేమ పెరుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో ఆచీ తూచీ వ్యవహరించాలి. నైతికతకు మీరెప్పుడూ ప్రాధాన్యమిస్తారు.
మకర రాశి (Capricorn)
ప్రేమ బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న వివాదాలు సమసిపోతాయి. ఏ విషయమైనా అన్ని కోణాల్లో ఆలోచించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. మేనేజ్మెంట్ స్థానంలో ఉన్నవారు సక్సెస్ పొందుతారు. మీరు ఉన్న రంగంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంటుంది.
కుంభ రాశి (Aquarius)
ఇవాళ ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ ప్రేమ జీవితం, రిలేషన్షిప్ సాఫీగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అన్నివిధాలా సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్య విషయాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. టార్గెట్ పట్ల చాలా ఫోకస్‌తో ఉంటారు. వారసత్వంగా పొందిన ఆస్తి విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తవచ్చు. పెళ్లి లేదా ప్రేమ ప్రతిపాదనలు పొందుతారు.
మీన రాశి (Pisces)
మీ పట్ల మీకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వం మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తులతో హ్యాపీ మూమెంట్స్ గడుపుతారు. చుట్టూ ఉన్న వ్యక్తులను బాగా నమ్ముతారు. మంచి పనుల పట్ల ఎక్కవ ఫోకస్ చేస్తారు. ఎప్పుడూ ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది.దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)