Horoscope Today September 1st 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తాము ప్రేమించే వ్యక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు

Horoscope Today September 1st 2022: ఇవాళ గురువారం. హిందువులు శ్రీమహా విష్ణువును ఆరాధిస్తారు. ఇవాళ లక్ష్మీ సమేత విష్ణువుకు పూజలు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2022, 06:41 AM IST
  • ఇవాళ గురువారం.. శ్రీమహా విష్ణువుకు అంకితం చేయబడిన రోజు
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు
  • గణనాథుడిని పూజించేవారికి శుభ ఫలితాలు కలుగుతాయి
Horoscope Today September 1st 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తాము ప్రేమించే వ్యక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు

Horoscope Today September 1st 2022: ఇవాళ గురువారం. హిందువులు శ్రీమహా విష్ణువును ఆరాధిస్తారు. ఇవాళ లక్ష్మీ సమేత విష్ణువుకు పూజలు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు. ప్రస్తుతం వినాయక నవరాత్రులు కావడంతో గణపతి పూజ చేసేవారికి ఆ గణనాథుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 

మేష రాశి (Aries)

ముఖ్య నిర్ణయాలకు ఇవాళ పూర్తిగా అనుకూలమైన రోజు. ఇవాళ తీసుకునే నిర్ణయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు చేయాల్సిన పనుల పట్ల పూర్తి ఫోకస్‌తో ఉంటారు. సకాలంలో వాటిని ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. మీపై ఉన్న బాధ్యతలను నెరవేరుస్తారు. మీలో టీమ్ స్పిరిట్ చాలా 'హై'లో ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ జీవితం బాగుంటుంది. మీ వ్యక్తిత్వం మరింత స్ట్రాంగ్‌గా ఉంటుంది.

వృషభ రాశి (Taurus)

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందవచ్చు. అయితే అవకాశాన్ని అందిపుచ్చుకునే క్రమంలో బాగా ఆలోచించి ముందడుగు వేయండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. మీ శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయి. ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో వేగం పెంచుతారు. మీరు పని చేపట్టారంటే పూర్తి చేస్తారనే నమ్మకం అందరిలో ఉంటుంది.

మిథున రాశి (GEMINI)

సైలెంట్‌గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఇంటి పనులపై కూడా ఫోకస్ చేస్తారు. శుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. పెద్దలు చెప్పే మాటలు తప్పక పాటిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. మీ ఎమోషన్స్‌ను అదుపులో ఉంచుకుంటారు. కష్టపడి పనిచేయడం కన్నా స్మార్ట్ వర్క్‌పై ఫోకస్ పెడుతారు. మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి (Cancer) 

రోజూ వారీ పనులన్నీ పక్కనపెట్టి ఆరోగ్యంపై ఫోకస్ చేస్తారు. కెరీర్ పరంగా కొత్త విషయాలు తెలుసుకోవడం లేదా కొత్త అవకాశాల గురించి వినడం జరుగుతుంది. అది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఇప్పుడున్న వేతనం కన్నా అధిక వేతనం పొందే జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. చిన్న చిన్న విషయాలకు సంజాయిషీలతో పనిలేదు. మరీ ఎక్కువ ఎమోషన్ అవొద్దు. 

సింహ రాశి (LEO)

కొన్ని కీలక చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరికొకరు సాయపడుతారు. బిజినెస్‌లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార రీత్యా గుడ్ న్యూస్ అందుకునే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో కాస్త బోల్డ్‌గా వ్యవహరిస్తారు. మీ ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. గతంలో మీరు చేయాలనుకుని చేయలేకపోయిన పనులు తిరిగి ప్రారంభించేందుకు ఇవాళ అనుకూలమైన రోజు. 

కన్య రాశి (Virgo)

మీ పట్ల అందరిలో ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటారు. మీరు ప్రేమించే వ్యక్తులకు మరింత దగ్గరవుతారు. సంపాదన పెరుగుతుంది. సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నైతికంగా ఎప్పుడూ తగ్గరు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రేమ బంధం మరింత మధురంగా మారుతుంది. ఒకరినొకరు గౌరవించుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.

తులా రాశి (Libra)

కుటుంబ విషయాల పట్ల ఇవాళ ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీకు ఆసక్తి ఉన్న పనిని టాప్ ప్రియారిటీతో పూర్తి చేస్తారు. ఇవాళంతా మీ చుట్టూ పాజిటివిటీ ఉంటుంది. మీ నిర్ణయాలన్నింటిలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మీ వ్యక్తిత్వం మరింత నిరాడంబరతను సంతరించుకుంటుంది. మెమొరీ పవర్ పెరుగుతుంది. మీ బడ్జెట్ ప్రకారమే పెట్టుబడులు పెట్టండి. తలకు మించిన భారం మోయుద్దు.

వృశ్చిక రాశి (Scorpio)

ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో తెలియని ఎగ్జయిట్‌మెంట్ చోటు చేసుకుంటుంది. మంచి లైఫ్‌ను లీడ్ చేస్తారు. అది ఇతరులకు కొంత అసూయ కలిగించవచ్చు. ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళ మీకు సక్సెస్‌ఫుల్ డే అవుతుంది. ఏ పని చేపట్టినా ప్రయోజనమే తప్ప నష్టం ఉండదు. మీరు ప్రేమించే వ్యక్తులకు స్పెషల్ టైమ్ కేటాయిస్తారు. మునుపటికన్నా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారస్తులకు తమ టార్గెట్ పట్ల మదిలో ఎప్పుడూ ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. 

మకర రాశి (Capricorn) 

అందరి నమ్మకాన్ని చూరగొంటారు. మీలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. మీరు చేపట్టే పనికి తప్పక ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. సమీప భవిష్యత్తులో వాటి ప్రయోజనాలు పొందే సంకేతాలు అందుతాయి. మీ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి. ఆర్థికపరమైన వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. 

కుంభ రాశి (Aquarius)

పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు ప్రేమించే వ్యక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పని ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులు మంచి సందేశం వినే అవకాశం ఉంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి ట్రిప్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం అన్నివిధాలా బాగుంటుంది. వృత్తి జీవితంలో టెన్షన్స్ ఏమీ ఉండవు. ఇవాళంతా కూల్‌గా ఉంటారు.

మీన రాశి (Pisces) 

మీరు ప్రేమించే వ్యక్తుల పట్ల నమ్మకం ఉంచండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తగిన సహాయ సహకారాలు లభిస్తాయి. నమ్మకం ద్రోహం చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయమైనా సూటిగా మాట్లాడండి. అనవసర ఫైటింగ్స్‌ చేటు చేస్తాయి. చేపట్టిన పనుల్లో మరీ ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. ఇవాళ మీ నిర్ణయాత్మక శక్తి మరింత పెరుగుతుంది. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: iPhone SE 4: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, iPhone SE 4 ఫస్ట్‌లుక్ విడుదల, ధర ఎంతంటే

Also Read: Ganesh Chaturthi 2022: గణేశ్ చతుర్థి నాడు ఇంట్లో ఎలుక కనిపిస్తే శుభమా ? అశుభమా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News